గత ప్రభుత్వంలో డ్వాక్రా మహిళల రుణాలు మాఫీ చేస్తామని చెప్పి.. ఒక్క రూపాయి కూడా ఇవ్వలేదని హోంమంత్రి మేకతోటి సుచరిత అన్నారు. గత ప్రభుత్వం రూ.10 వేల కోట్లు డ్వాక్రా మహిళలకు రుణమాఫీ చేస్తామని చెప్పి.. మాట తప్పారన్నారు. గుంటూరు జిల్లా ప్రత్తిపాడులో వైఎస్సార్ ఆసరా రెండో విడత కార్యక్రమంలో హోంమంత్రి సుచరిత హాజరయ్యారు.
డ్వాక్రా మహిళలను రుణమాఫీ విషయంలో ప్రభుత్వం మోసం చేస్తుందని ప్రతిపక్షాలు ఆరోపిస్తున్నాయని సుచరిత ధ్వజమెత్తారు. జగన్ ఇచ్చిన హామీల్లో భాగంగా.. ఇప్పటికే రెండు విడతల్లో రూ.12 వేల కోట్లు మహిళల ఖాతాలలో జమ చేశామన్నారు.
నాలుగు విడతలలో ఆసరా పథకం కింద రూ.25 వేల కోట్లు.. మహిళల ఖాతాలలో జమ చేస్తామని హోంమంత్రి తెలిపారు. 2016లో ఇవ్వాల్సిన సున్నా వడ్డీ కూడా.. వైకాపా ప్రభుత్వమే రూ.2 వేల కోట్లు చెల్లించిందన్నారు. రాష్ట్రవ్యాప్తంగా మహిళల పేరు మీద.. 31 లక్షల ఇళ్ల స్థలాలు ఇచ్చామని, 15 లక్షల గృహాల నిర్మాణం చేపట్టామన్నారు. అనంతరం మహిళకు చెక్కుల పంపిణీ చేశారు.
ఇదీ చదవండి:
Minister Perni Nani: దసరా దృష్ట్యా 4 వేల ప్రత్యేక ఆర్టీసీ బస్సులు: పేర్ని నాని