గుంటూరు జిల్లా ప్రత్తిపాడు మండలం గనికపూడిలో ఇళ్ల పట్టాల పంపిణీ కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమానికి హోం మంత్రి మేకతోటి సుచరిత హాజరయ్యారు. ఈ క్రమంలో ప్రభుత్వ తీరుపై లబ్ధిదారులు అసహనం వ్యక్తం చేశారు. ఇళ్ల పట్టాల పంపిణీలో అవకతవకలు జరిగాయని ఆరోపించారు. అర్హులైన తమకు కాదని అనర్హులైన వారికి ఇళ్ల పట్టాలు ఇస్తున్నారని మండిపడ్డారు. ఈ క్రమంలో ఆందోళన చేస్తున్న మహిళలపై హోంమంత్రి సుచరిత ఆగ్రహం వ్యక్తం చేశారు.. జాగ్రత్తగా మాట్లాడాలని హెచ్చరించారు.
ఇదీచదవండి.