ETV Bharat / state

'సీఎం జగన్ ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలే... శ్రీరామ రక్ష' - గుంటూరు జిల్లాలో వైకాపా సర్పంచులకు సన్మానం తాజా వార్తలు

గుంటూరు జిల్లా కాకుమాను పరిధిలోని పంచాయతీ ఎన్నికల్లో వైకాపా మద్దతుతో గెలుపొందిన సర్పంచులను హోమంత్రి సుచరిత సన్మానించారు. గ్రామాల్లో ప్రజా సమస్యల పరిష్కారానికి సర్పంచులు కృషి చేయాలన్నారు.

home minister felicitation of panchayat elections winners at guntur
గుంటూరు జిల్లాలో వైకాపా సర్పంచులకు సన్మానం
author img

By

Published : Feb 27, 2021, 2:21 PM IST

తెదేపా కంచుకోటలో వైకాపా బలోపేతం కావడం సంతోషంగా ఉందని హోంమంత్రి మేకతోటి సుచరిత అన్నారు. గుంటూరు జిల్లా కాకుమానులో ఇటీవల వైకాపా మద్దతుతో గెలుపొందిన సర్పంచులను ఆమె సత్కరించారు. ముఖ్యమంత్రి ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలే శ్రీరామరక్ష అన్నారు. తెదేపా అవిర్భవించాక కాకుమాను, పెదనందిపాడు, వట్టిచెరుకూరు మండలాల్లో వేరే పార్టీకి అవకాశం లేకుండా పోయిందని... అలాంటి ప్రాంతంలో వైకాపాను గెలిపించేందుకు నాయకులు చేసిన కృషి అభినందనీయమని అన్నారు.

గ్రామాల్లో ప్రజా సమస్యల పరిష్కారానికి సర్పంచులు కృషి చేయాలని దిశా నిర్దేశం చేశారు. ప్రభుత్వ పథకాలను ప్రజలలోకి మరింత దగ్గర చేయాలని చెప్పారు. ఈ కార్యక్రమంలో వైకాపా మండల కన్వీనర్లు నల్లమోతు శివరామకృష్ణ, మదమంచి వాసు, ఎస్సీసెల్ మండల కన్వీనర్ గేరా పున్నారావులు పాల్గొన్నారు.

ఇదీ చూడండి:

అమరావతిలో వింతశబ్దంతో కంపించిన భూమి

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.