ETV Bharat / state

Weather : రాష్ట్రంలో మండుతున్న ఎండలు.. అత్యధికంగా 44 డిగ్రీల సెల్సియస్​ ఉష్ణోగ్రత

Summer Weather : రాష్ట్రంలో ఉష్టోగ్రతలు పెరుగుతున్నాయి. గత నాలుగు రోజుల నుంచి భానుడు నిప్పుల వర్షం కురిపిస్తున్నాడు. ఎండ వల్ల ఉక్కపోతతో రాష్ట్ర ప్రజలు ఇబ్బంది పడుతున్నారు. తాజాగా ఈ రోజు నమోదైన ఉష్ణోగ్రతల వివరాలను భారత వాతావరణ విభాగం విడుదల చేసింది.

Weather
ఎండలు
author img

By

Published : Apr 18, 2023, 2:24 PM IST

Summer Temperature : రాష్ట్రంలో ఎండలు మండిపోతున్నాయి. ఏప్రిల్​లోనే ఈ విధంగా ఉంటే రాబోయే నెలలో ఎలా ఉంటుందో అని ప్రజలు ఆందోళన చెందుతున్నారు. ప్రస్తుతం ఉష్ణ గాలుల ప్రభావం కొనసాగుతోంది. దీంతో కోస్తాంధ్ర రాయలసీమ జిల్లాల్లో తీవ్రస్థాయిలో ఉష్ణోగ్రతలు నమోదు అవుతున్నట్లు భారత వాతావరణ విభాగం స్పష్టం చేసింది. ఏపీలో ఉష్ణోగ్రతల తీవ్రత సుమారు 44 డిగ్రీలకు చేరువైంది. దాదాపు రాష్ట్రంలోని అన్ని చోట్ల ఇదే స్థాయిలో ఉష్ణోగ్రతలు రికార్డు అవుతున్నాయి. దీంతో ఏపీలోని కోస్తాంధ్ర, రాయలసీమ ప్రాంతాలు ఎండ వేడికి సెగలు కక్కుతున్నాయి. కొన్ని ప్రాంతాలలో ఎండకు ఉష్ణోగ్రతలు గరిష్ఠంగా 44 డిగ్రీల సెల్సియస్​ రికార్డు కాగా .. మరికొన్ని చోట్ల అత్యల్పంగా 40 డిగ్రీలుగా నమోదయ్యిందని వాతావారణ శాఖ తెలిపింది.

రాష్ట్రంలో వివిధ జిల్లాల్లో ఈ రోజు నమోదైన ఉష్ణోగ్రతల వివరాలు..

  • అత్యధికంగా కర్నూలు జిల్లా మంత్రాలయం వద్ద 44 డిగ్రీల సెల్సియస్
  • శ్రీకాకుళం జీ సింగడాంలోనూ 43.84 డిగ్రీలు,
  • అనంతపురం లో 43.68 డిగ్రీలు ,
  • విజయనగరం లో 43.17 డిగ్రీలు,
  • శ్రీకాకుళం పలాసలో 43.02 డిగ్రీలు,
  • ఏలూరు 43.04 డిగ్రీల సెల్సియస్ ,
  • నంద్యాల లో 42.73 డిగ్రీలు ,
  • రెంటచింతల 42.71,
  • అనకాపల్లిలో 42.59 డిగ్రీలు,
  • ప్రకాశం జిల్లా 42.5 డిగ్రీలు ,
  • సిద్ధవటంలో 42.43,
  • కర్నూలులో 42.27 డిగ్రీలు,
  • విశాఖ లో 42.14 డిగ్రీలు రికార్డు అయ్యింది,
  • పార్వతీపురం మన్యం 41.7 డిగ్రీలు,
  • తిరుపతి 41.74 డిగ్రీలు,
  • నెల్లూరు 41.47 డిగ్రీల సెల్సియస్,
  • అన్నమయ్య జిల్లా 41.11 డిగ్రీలు,
  • చిత్తూరు 40.98 డిగ్రీలు,
  • అల్లూరి జిల్లా 40.78 డిగ్రీలు,
  • సత్యసాయి జిల్లా 40.74 డిగ్రీలు ,
  • ఎన్టీఆర్ జిల్లా 40.53 డిగ్రీలు
  • అత్యల్పంగా కాకినాడ 40.52 డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రత నమోదైంది.

జాగ్రత్తలు అవసరం : రాష్ట్రంలో అత్యధికంగా నమోదు అవుతున్న ఉష్ణోగ్రతలను చూసి ప్రజలు అందోళన చెందుతున్నారు. పగటి వేళ ఎండలో తిరగకుండా ఉండాలని వైద్యులు, నిపుణులు సలహాలు అందిస్తున్నారు. తప్పని సరి అయితే తప్ప పగటి పూట బయటకు వెళ్లకుండా.. ఇంట్లోనే ఉండాలని సూచిస్తున్నారు. మజ్జిగ, కొబ్బరి నీళ్లు, పళ్ల రసాలు తరచు తీసుకోవాలని సూచిస్తున్నారు. వేడి గాలుల ప్రభావంతో వడదెబ్బ తగిలే అవకాశాలు అధికమని హెచ్చరిస్తున్నారు. ఎండలో వెళ్లినప్పుడు గొడుగు వెంట తీసుకు వెళ్లాలని, తెల్లటి వస్త్రాలు, టోపీ ధరించి వెళ్లాలని సలహాలు అందిస్తున్నారు. రాబోయే రోజుల్లో ఎండలు మరింత తీవ్రం కానున్నాయని.. చిన్నపిల్లలు, వృద్ధుల పట్ల జాగ్రత్తగా ఉండాలని సూచిస్తున్నారు.

ఇవీ చదవండి :

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.