గుంటూరు జిల్లాలో..
గుంటూరు జిల్లా పల్నాడు ప్రాంతంలో జిల్లా కలెక్టర్ దినేష్ యాదవ్ పర్యటించారు. దాచేపల్లి మండలం శ్రీనగర్ గ్రామంలోని ఎన్నికల బూత్‌ను అధికారులతో కలసి పరిశీలించారు. అనంతరం గురజాల ఆర్డీఓ కార్యాలయంలో అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు. ఎన్నికలకు ముందు జాగ్రత్త చర్యలపై అధికారులకు పలు సూచనలు చేశారు.
విశాఖ జిల్లాలో..
విశాఖ జిల్లాలో మూడో విడతగా పాడేరు డివిజన్లో జరిగే పంచాయతీ ఎన్నికలకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశామని అధికారులు తెలిపారు. 237 పంచాయతీలు, 1465 వార్డులకు మూడో విడతలో ఎన్నికలు జరుగుతున్నాయి. 6లక్షల 35 మంది ప్రజలు తమ ఓటు హక్కు వినియోగించుకోనున్నారు. పూర్తిగా గిరిజన ప్రాంతాలు కావడంతో.. పోలింగ్ సిబ్బంది రవాణాకు ప్రత్యేక ఏర్పాట్లు చేశారు.
విశాఖ, అనకాపల్లి, ఎలమంచలి, చోడవరం నుంచి పోలింగ్ సిబ్బంది కోసం బస్సులు ఏర్పాటు చేశారు. ఈ ప్రాంతాల్లో మూడో విడత పోలింగ్ మధ్యాహ్నం 1.30 నిమిషాల వరకే జరుగుతుంది. వెంటనే ఫలితాలు వెల్లడి చేయడానికి సన్నాహాలు చేశామని పాడేరు పంచాయతీ ఎన్నికల అధికారి కిశోర్ తెలిపారు.
ఇదీ చదవండి: