High Court Serious Comments: ప్రభుత్వాధికారులకు కోర్టులు ఎప్పడికప్పుడు మెుట్టికాయలు వేయడం.. ఆ తరువాత అంతా మాములే అన్నట్లుగా మారిపోయింది ప్రభుత్వం అధికారుల తీరు. గతంలో వివిధ సందర్బాల్లో సీఎస్, డీజీపీ, టీటీడీ ఈవో ఇలా వివిధ ఉన్నత స్థాయిలో ఉన్న అధికారులు కోర్టు సూచనలు పాటించకపోవడంతో హైకోర్టు ఆగ్రహం వ్యక్తం చేయడమే కాదు వారిపై చర్యలకు ఉపక్రమించింది. కోర్టు ఆగ్రహాన్ని గ్రహించిన అధికారులు తమ తప్పును బోనులో నిలబడి ఒప్పుకున్న ఘటనలో చాలానే చూశాం. కోర్టు ఆగ్రహనికి గురి కావడం ఈసారి విద్యుత్ అధికారుల వంతైంది. ఈసారి అధికారుల తీరుపై న్యాయముర్తి తీవ్ర అసంతృప్తిని వ్యక్తం చేయడమే కాకుండా.. కోర్టుకు హాజరు కావడం అధికారులు నామోషీగా భావిస్తున్నారా అంటూ ప్రశ్నించారు.
ధర్మాసనంలో అధికారులు అప్పీల్: విద్యుత్ శాఖ అధికారులపై హైకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. ఒక పిటిషనర్ వ్యవహారంలో కోర్టు ముందు హాజరుకావాల్సిందిగా సీపీడీసీఎల్ చైర్మన్, ఎండీలు, ఇతర అధికారులను సింగిల్ జడ్జ్ ఆదేశించారు. ఈ రోజు కోర్టుకు హాజరుకాకుండా ధర్మాసనంలో అధికారులు అప్పీల్ వేశారు. ఈ సందర్బంగా కోర్టుకు వివరణ ఇవ్వడానికి అధికారులకు నామోషీ ఎందుకు.. న్యాయమూర్తి అడిగిన ప్రశ్నలకు మీరు సమాధానం చెప్పలేరా? అంటూ ప్రశ్నించింది. కోర్టు ముందు హాజరైతే న్యాయమూర్తి ఏమీ ఉరితీయరు కదా? సింగిల్ జడ్జ్ రమ్మని ఆదేశిస్తే అప్పీల్ వేయడం మీకు అలవాటుగా మారిందని ధర్మాసనం వ్యాఖ్యానించింది. కోర్టు ఆదేశాలను అధికారులు అమలు చేయాలని స్పష్టం చేసింది. సింగిల్ జడ్జ్ ఆదేశాల్లో మేము జోక్యం చేసుకోలేమని.. విద్యుత్ శాఖ అధికారులకు డివిజన్ బెంచ్ తేల్చి చెప్పింది. అధికారులు దాఖలు చేసిన అప్పిల్ను హైకోర్టు కొట్టివేసింది.
గతంలో ముగ్గరు ఐఏఎస్లు: పాఠశాల ఆవరణలో సచివాలయాలు, రైతు భరోసా కేంద్రాల నిర్మాణాలను వ్యతిరేకిస్తూ దాఖలు చేసిన పిటిషన్‌పై హైకోర్టు విచారణ సమయంలో.. కోర్టు ఆదేశాల మేరకు ప్రభుత్వాధికారులు హాజరు కాకపోవడంతో హైకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. ప్రధాన కార్యదర్శి జవహర్ రెడ్డితోపాటు.. విద్యాశాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ, పంచాయితీ రాజ్ శాఖ సెక్రటరీ ముగ్గరు ఐఏఎస్లు హైకోర్టులో హాజరయ్యారు.
ఇవీ చదవండి: