ETV Bharat / state

'ఆ ట్రస్టు రిజిస్టర్ వ్యవహారంపై తొందరపాటు చర్యలోద్దు'

ధూళిపాళ్ల వీరయ్య చౌదరి ట్రస్టు రిజిస్టర్ చేయించే వ్యవహారంపై తొందరపాటు చర్యలు తీసుకోవద్దని దేవాదాయ శాఖ అధికారులను హైకోర్టు ఆదేశించింది. హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ప్రశాంత్ కుమార్ మిశ్ర , జస్టిస్ ఎం.సత్యనారాయణమూర్తితో కూడిన ధర్మాసనం ఈ మేరకు ఆదేశాలు ఇచ్చింది. ట్రస్టును దేవాదాయ చట్ట ప్రకారం నమోదు చేసుకోవాలంటూ ఆ శాఖ కమిషనర్ నోటీసును సవాలు చేస్తూ మేనేజింగ్ ట్రస్టీ ధూళిపాళ్ల నరేంద్రకుమార్, మరో ఇద్దరు ట్రస్టీలు హైకోర్టులో వేర్వేరుగా వ్యాజ్యాలు దాఖలు చేశారు.

HIGH COURT
HIGH COURT
author img

By

Published : Apr 28, 2022, 3:49 AM IST

గుంటూరు జిల్లా చేబ్రోలు మండలం వడ్లమూడిలోని ధూళిపాళ్ల వీరయ్య చౌదరి మెమోరియల్ ట్రస్టును దేవాదాయ చట్ట ప్రకారం రిజిస్టర్ చేయించే వ్యవహారంపై తొందరపాటు చర్యలు తీసుకోవద్దని దేవాదాయ శాఖ అధికారులను హైకోర్టు ఆదేశించింది. ట్రస్టు కార్యకలాపాలపై విచారణ కొనసాగించుకోవచ్చని స్పష్టం చేసింది. ప్రతివాదులకు నోటీసులు జారీచేసింది. హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ప్రశాంత్ కుమార్ మిశ్ర , జస్టిస్ ఎం.సత్యనారాయణమూర్తితో కూడిన ధర్మాసనం ఈ మేరకు ఆదేశాలు ఇచ్చింది.

ధూళిపాళ్ల వీరయ్య చౌదరి మెమోరియల్ ట్రస్టును దేవాదాయ చట్ట ప్రకారం నమోదు చేసుకోవాలంటూ ఆ శాఖ కమిషనర్ ఈ ఏడాది జనవరి 5 న ఇచ్చిన నోటీసును సవాలు చేస్తూ మేనేజింగ్ ట్రస్టీ ధూళిపాళ్ల నరేంద్రకుమార్, మరో ఇద్దరు ట్రస్టీలు వి.బుద్ధయ్య చౌదరి, టి.రామలింగేశ్వరరావు హైకోర్టులో వేర్వేరుగా వ్యాజ్యాలు వేశారు. ఆ వ్యాజ్యాలపై విచారణ జరిపిన హైకోర్టు సింగిల్ జడ్జి .. నోటీసుపై అభ్యంతరాల్ని రెండు వారాల్లో అధికారులకు సమర్పించాలని ట్రస్టీ మేనేజింగ్ ట్రస్టీని ఆదేశించారు. వ్యాజ్యాలను కొట్టేస్తూ ఫిబ్రవరి 9 న తీర్పు ఇచ్చారు. సింగిల్ జడ్జి తీర్పును సవాలు చేస్తూ .. ధూళిపాళ్ల వీరయ్య చౌదరి మెమోరియల్ ట్రస్ట్ మేనేజింగ్ ట్రస్టీ .. ధూళిపాళ్ల నరేంద్రకుమార్, ఇద్దరు ట్రస్టీలు ధర్మాసనం ముందు అప్పీళ్లు వేశారు.

పిటిషనర్​ తరఫున సీనియర్ న్యాయవాది బి.ఆదినారాయణరావు వాదనలు వినిపించారు. పాల ఉత్పత్తిదారుల ప్రయోజనాల కోసం ట్రస్ట్​ను ఏర్పాటు చేశామన్నారు. ఆ ట్రస్టు .. దేవాదాయ చట్ట ప్రకారం ' ఛారిటబుల్ సంస్థ ' అనే నిర్వచనం కిందకు రాదన్నారు. అది పబ్లిక్ ఛారిటబుల్ ట్రస్టు కాదని తెలిపారు. ట్రస్ట్ ద్వారా ఆసుపత్రిని ఏర్పాటు చేసి పాల ఉత్పత్తిదారులకు రాయితీపై వైద్య సేవలు అందిస్తున్నాం. బయటి వ్యక్తులకు పూర్తిస్థాయి రుసుముతో వైద్యం చేస్తున్నాం. దేవాదాయ చట్ట ప్రకారం ట్రస్టును నమోదు చేసుకుంటే .. దానిపై నియంత్రణ పూర్తిగా దేవాదాయ శాఖ అధికారులకు ఉంటుందని ధర్మాసనానికి తెలిపారు. దీంతో ట్రస్టుపై అధికారం కోల్పోతామన్నారు. ఈనేపథ్యంలో రిజిస్ట్రేషన్ చేసే వ్యవహారంపై ఒత్తిడి చేయకుండా అధికారులను నిలువరించండి ' అని కోరారు.

ప్రభుత్వం తరఫున అడ్వొకేట్ జనరల్ ఎస్.శ్రీరామ్ వాదనలు వినిపించారు. ప్రైవేటు, కుటుంబ ట్రస్టు కాదన్నారు. పబ్లిక్ ట్రస్టు అన్నారు. ట్రస్టు నిర్వహణకు పాల ఉత్పత్తిదారులతో పాటు ప్రజల నుంచి విరాళాలు సేకరిస్తున్నారన్నారు. సంగం పాల ఉత్పత్తిదారుల సహకార సొసైటీగా మొదట ఏర్పడినప్పుడు ప్రభుత్వం భూములు తీసుకున్నారన్నారు. ట్రస్టు కార్యకలాపాలపై వాస్తవాలు తెలుసుకునేందుకు విచారణ చేస్తున్నమన్నారు. ఇరువైపు వాదనలు విన్న ధర్మాసనం .. దేవాదాయ చట్ట ప్రకారం ట్రస్టును రిజిస్ట్రేషన్ చేసుకోవాలని తొందరపెట్టవద్దంటూ మధ్యంతర ఉత్తర్వులిచ్చింది.

ఇదీ చదవండి:' ఆ నోటీసులపై అభ్యంతరాలను రెండు వారాల్లో సమర్పించండి'

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.