ETV Bharat / state

అంబటి అక్రమ మైనింగ్ ఆరోపణలపై హైకోర్టులో విచారణ - గుంటూరు జిల్లా తాజా వార్తలు

గుంటూరు జిల్లా సత్తెనపల్లి ఎమ్మెల్యే అంబటి రాంబాబు, ఆయన అనుచరులు అక్రమ మైనింగ్​కు పాల్పడుతున్నారంటూ దాఖలైన పిటిషన్​పై బుధవారం హైకోర్టులో మరోసారి విచారణ జరిగింది. ఈ కేసులో మైనింగ్ శాఖ బుధవారం కౌంటర్ అఫిడవిట్ దాఖలు చేసింది

ap high court
ap high court
author img

By

Published : Oct 14, 2020, 7:39 PM IST

గుంటూరు జిల్లా రాజుపాలెం మండలం కోటనెమలిపురి, కుబాదుపురం రెవెన్యూ గ్రామాల పరిధిలోని ప్రభుత్వ భూముల్లో ఎమ్మెల్యే అంబటి రాంబాబు , ఆయన అనుచరులు ఆక్రమ మైనింగ్​కు పాల్పడుతున్నారని పేర్కొంటూ దాఖలైన పిటిషన్​పై బుధవారం హైకోర్టులో పిటిషన్ దాఖలైంది. కోటనెమలిపురి, కొండమోడు గ్రామాలకు చెందిన వైకాపా కార్యకర్తలు పప్పుల శ్రీనివాసరెడ్డి, నల్లగొర్ల రామయ్య ఈ వ్యాజ్యం దాఖలు చేశారు.

ఎమ్మెల్యే అంబటి రాంబాబు, భవనాసి నరసింహారావు, నెల్లూరి మధుబాబు, దూదేకుల మౌలాలి, గిరిగిపాటి రేణుకస్వామి, పుణ్యాల రామిరెడ్డి, మారెళ్ల సాంబశివా రెడ్డి, దూదేకుల శ్రీనుబాషా, బుర్రి రాంబాబు గనుల అక్రమ తవ్వకాలకు పాల్పడుతున్నారని ఆరోపించారు. ఈ కేసులో మైనింగ్ శాఖ బుధవారం కౌంటర్ అఫిడవిట్ దాఖలు చేసింది. తదుపరి విచారణను నాలుగు వారాలకు న్యాయస్థానం వాయిదా వేసింది.

ఇదీ చదవండి:

భారీవర్షాలు, వరదలపై సీఎం జగన్‌ సమీక్ష

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.