BED first phase counseling: బీఈడీ కళాశాలల్లో కౌన్సెలింగ్ గడువు పెంచాలని కోరుతూ బిఈడీ విద్యార్థులు హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఈనెల 25 నుంచి 27 వరకు కౌన్సెలింగ్ నిర్వహిస్తున్నట్లు.. విద్యార్థులకు ముందు రోజు సాయంత్రమే తెలిపారని పిటిషనర్ తరపు న్యాయవాది విజయ్ వాదనలు వినిపించారు. సహజ న్యాయ సూత్రాలకు విరుద్ధంగా ప్రభుత్వం వ్యవహరించిందని తెలిపారు. షెడ్యూల్ ప్రకారం నేటితో మొదటి దశ కౌన్సెలింగ్ పూర్తి కానుంది.
వాదనలు విన్న న్యాయస్థానం మొదటి దశ కౌన్సెలింగ్ ఈనెల 31 వరకు పొడిగిస్తూ మధ్యంతర ఉత్తర్వులు ఇచ్చింది. తదుపరి విచారణ నాలుగు వారాలకు వాయిదా వేసింది.
ఇవీ చదవండి: