ETV Bharat / state

High Court: కుళ్లిన కోడిగుడ్డు తిని చిన్నారి మృతి కేసులో.. ప్రభుత్వంపై హైకోర్టు ఘాటు వ్యాఖ్యలు - andhra pradesh latest news

High Court: అంగన్‌వాడీ కేంద్రంలో.. కుళ్లిన కోడిగుడ్డు తిని ఓ చిన్నారి మృతి చెందిన కేసులో.. మానవ హక్కుల కమిషన్‌ ఇచ్చిన ఆదేశాలను సవాల్‌ చేస్తూ.. రాష్ట్ర ప్రభుత్వం వేసిన పిటిషన్‌ని హైకోర్టు కొట్టివేసింది. చిన్నారి మరణం మానవ తప్పిదంగానే ధర్మాసనం పేర్కొంది. ఈ సందర్భంగా ప్రభుత్వంపై హైకోర్టు ఘాటు వ్యాఖ్యలు చేసింది.

High Court
హైకోర్టు
author img

By

Published : Apr 27, 2023, 7:20 AM IST

High Court: అంగన్‌వాడీ కేంద్రంలో కోడిగుడ్డు తిని చిన్నారి మృతి చెందిన ఘటనలో 8 లక్షల రూపాయల పరిహారం చెల్లించాలంటూ మానవ హక్కుల కమిషన్‌ ఇచ్చిన ఆదేశాలను రాష్ట్ర ప్రభుత్వం సవాలు చేయడంపై హైకోర్టు విస్మయం చెందింది. ఇలాంటి విషయాలపైన ప్రభుత్వం వ్యాజ్యం దాఖలు చేయకుండా ఉండాల్సిందని పేర్కొంది. కాగా చిత్తూరు జిల్లా కుప్పం మున్సిపాలిటి పరిధిలోని గుల్లేపల్లి అంగన్‌వాడీ కేంద్రంలో కోడిగుడ్డు తిని చిన్నారి మృతి చెందింది.

సంక్షేమ ప్రభుత్వం అని చెప్పుకుంటున్న మీ ప్రతిష్ఠ మసకబారుతుందని వ్యాఖ్యానించింది. కోర్టు విచారణలు ఆన్‌లైన్​లో జరుగుతున్నందున ప్రజలు, మీడియా గమనిస్తుంటారు.. జాగ్రత్తగా ఉండాలని ప్రభుత్వాన్ని హెచ్చరించింది. చిన్నారి మృతికి హెచ్‌ఆర్‌సీ మంజూరు చేసిన 8 లక్షల పరిహారం తక్కువని.. కుక్క కాటు ఘటనలో నాలుగేళ్ల కిందట తాను రూ.10 లక్షల పరిహారం మంజూరు చేశామని గుర్తుచేసింది.

ఉదయం 10.30 గంటలకు కోడిగుడ్డు తిన్న బాలిక మధ్యాహ్నం 12 గంటలకు అస్వస్థతకు గురై తర్వాత మరణించిందని గుర్తుచేసింది. ప్రభుత్వం సరఫరా చేసిన కోడిగుడ్డు తిన్నాకే బాలిక వాంతులు చేసుకుని అస్వస్థతకు గురైందని తెలిపింది. అధికారులు నిర్లక్ష్యంగా ఉన్నారని చెప్పడానికి ఆ ఒక్క కారణం చాలని పేర్కొంది.

అంగన్‌వాడీ సంరక్షణలో ఘటన చోటు చేసుకున్న నేపథ్యంలో అంగన్‌వాడీ టీచర్, స్త్రీ శిశు సంక్షేమశాఖ అధికారులే నిర్లక్షానికి బాధ్యత వహించాల్సిందేనని తేల్చిచెప్పింది. ఘటన చోటు చేసుకున్న వెంటనే శవపరీక్ష నిర్వహిస్తే వాస్తవాలు వెలుగులోకి వచ్చే వీలుండేదని.. నెలలు గడిచాక నిర్వహించి ప్రయోజనం ఏముంటుందని ప్రశ్నించింది. ప్రభుత్వం దాఖలు చేసిన వ్యాజ్యాన్ని కొట్టేసింది. హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ ప్రశాంత్‌కుమార్‌ మిశ్ర, జస్టిస్‌ ఎన్‌.జయసూర్యతో కూడిన ధర్మాసనం ఈమేరకు నిర్ణయం వెల్లడించింది.

దీనిపై ప్రభుత్వ న్యాయవాది రంగారావు వాదనలు వినిపించారు. పరిహారం చెల్లించాలని ఆదేశించడం.. హెచ్‌ఆర్‌సీ చట్ట నిబంధనలకు విరుద్ధమన్నారు. హెచ్‌ఆర్‌సీ కేవలం ప్రభుత్వానికి సిఫారసులు మాత్రమే చేయగలదన్నారు. ఈ వ్యవహారంలో అధికారుల నిర్లక్ష్యం లేదన్నారు. దేవుడి చర్య(యాక్ట్‌ ఆఫ్‌ గాడ్‌) వల్ల బాలిక మృతి చెందిందన్నారు. ఆ వాదనలను తోసిపుచ్చిన ధర్మాసనం.. ఆ ఘటనను దైవం చర్యగా పేర్కొనలేమంది. అలా అనుకుంటే నిర్లక్ష్యంగా జరిగిన ప్రమాదాల్లో ఎవరు మరణించినా.. అది దేవుడి చర్యగా పేర్కొని తప్పించుకుంటారంది.

బాలికది మానవ తప్పు కారణంగా జరిగిన మరణమేనంది. బాలిక ఆరోగ్య చరిత్ర ఏమిటో అంగన్‌వాడీలో చేర్చే సమయంలో తల్లిదండ్రులు వెల్లడించలేదన్న జీపీ వాదనను తోసిపుచ్చింది. అంగన్‌వాడీల్లో చేరే ప్రతి చిన్నారి ఆరోగ్యచరిత్ర వెల్లడించాలనేందుకు మీరేమైన నిబంధనలు పాటిస్తున్నారా? అందుకు విధివిధానాలేమైనా ఉన్నాయా? అని ప్రశ్నించింది.

అంగన్‌వాడీలలో చేర్చే పిల్లల తల్లిదండ్రులు ఎక్కువమంది నిరక్షరాస్యులు, పేదవర్గాలకు చెందిన వారై ఉంటారంది. ఏవిధంగా వారు ఆరోగ్య చరిత్రను చెబుతారని వ్యాఖ్యానించింది. ఇలాంటి వ్యవహారంపై ప్రభుత్వం వ్యాజ్యం వేయడం మంచిదికాదని హితవు పలికింది. చిన్నారి మృతికి హెచ్‌ఆర్‌సీ మంజూరు చేసిన 8లక్షల పరిహారం తక్కువని పేర్కొంది. అంగన్‌వాడీ టీచర్, ప్రభుత్వం దాఖలు చేసిన వ్యాజ్యాన్ని కొట్టేసింది.

ఎప్పుడు జరిగిందంటే: కుప్పం మున్సిపాలిటీ పరిధిలోని గుల్లేపల్లె అంగన్‌వాడీ కేంద్రంలో 2022 ఫిబ్రవరిలో.. కుళ్లిన కోడిగుడ్డు తిని అస్వస్థతకు గురై వాంతులు చేసుకున్న ఓ చిన్నారి ఆసుపత్రికి తీసుకెళ్లగా అప్పటికే కన్నుమూసింది. పత్రికల్లో వచ్చిన కథనాల ఆధారంగా హెచ్‌ఆర్‌సీ విచారణ జరిపింది. చిన్నారి తల్లిదండ్రులు సరిత, మురేగేష్‌లకు రూ.8 లక్షల పరిహారం చెల్లించాలని ఈ ఏడాది జనవరి 31న తీర్పు ఇచ్చింది. ఆ సొమ్మును చెల్లించాలని అంగన్‌వాడీ టీచర్, కుప్పం తహసీల్దార్, శిశుసంక్షేమశాఖ ముఖ్యకార్యదర్శి, చిత్తూరు జిల్లా కలెక్టర్‌ తదితరులను ఆదేశించింది.

ఇవీ చదవండి:

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.