ETV Bharat / state

AP High Court: అత్యవసర వ్యాజ్యం దాఖలు చేసిన ఏబీ వెంకటేశ్వరరావు.. ప్రభుత్వానికి హైకోర్టు ప్రశ్నలు

AP High Court: సీనియర్‌ ఐపీఎస్‌ ఏబీ వెంకటేశ్వరరావు దాఖలు చేసిన వ్యాజ్యం విచారణ సందర్భంగా హైకోర్టు పలు కీలక వ్యాఖ్యలు చేసింది. క్రిమినల్‌ కేసుల్లో తీవ్ర నేరారోపణలు ఎదుర్కొంటూ బెయిలుపై బయట ఉన్న వారిని విదేశాలకు వెళ్లేందుకు అనుమతిస్తున్నారని.. అలాంటి సందర్భాలున్నాయని హైకోర్టు వ్యాఖ్యానించింది.

High Court
హైకోర్టు
author img

By

Published : Jul 4, 2023, 10:36 AM IST

Updated : Jul 4, 2023, 11:20 AM IST

AP High Court: క్రిమినల్‌ కేసుల్లో తీవ్ర నేరారోపణలు ఎదుర్కొంటూ బెయిలుపై బయట ఉన్న వారు విదేశాలకు వెళ్లేందుకు అనుమతిస్తున్నారని.. అలాంటి సందర్భాలు ఉన్నాయని హైకోర్టు వ్యాఖ్యానించింది. విదేశాలకు వెళ్లేందుకు రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నిరాకరించడాన్ని సవాలు చేస్తూ సీనియర్‌ ఐపీఎస్‌ అధికారి ఏబీ వెంకటేశ్వరరావు దాఖలు చేసిన వ్యాజ్యం విచారణ సందర్భంగా హైకోర్టు ఈ వ్యాఖ్యలు చేసింది.

ఈఎల్‌పై తాను 41 రోజులు విదేశాలకు వెళ్లేందుకు అనుమతి కోరుతూ చేసిన విజ్ఞప్తిని సీఎస్‌ తిరస్కరించడాన్ని సవాలు చేస్తూ ఐపీఎస్‌ ఏబీ వెంకటేశ్వరరావు హైకోర్టులో అత్యవసర వ్యాజ్యం దాఖలు చేశారు. దీనిపై న్యాయవాది శరత్‌చంద్ర వాదనలు వినిపించారు. పిటిషనర్‌ విజ్ఞప్తిని సీఎస్‌ తిరస్కరించారన్న ఏబీ వెంకటేశ్వరరావు తరఫు న్యాయవాది.. శాఖాపరమైన విచారణ 2021 నుంచి పెండింగ్‌లో ఉందని కోర్టుకు నివేదించారు. దాన్ని కారణంగా చూపుతూ పిటిషనర్‌ అభ్యర్థనను తిరస్కరించడానికి వీల్లేదని పేర్కొన్నారు.

దరఖాస్తు చేసిన 21 రోజుల్లో నిర్ణయం వెల్లడించని కారణంగా అనుమతి లభించినట్లు భావిస్తున్న తరుణంలో.. అందుకు భిన్నంగా ఈఎల్‌ సెలవులు మంజూరు చేయకపోవడం సరికాదని న్యాయవాది పేర్కొన్నారు. ఏ నిబంధనలను కారణంగా చూపుతూ సెలవులు నిరాకరించారో అవి పిటిషనర్‌కు వర్తించవని అన్నారు. సీఎస్‌ ఇచ్చిన ఉత్తర్వులను రద్దు చేసి పిటిషనర్‌ విదేశాలకు వెళ్లేందుకు అనుమతి ఇవ్వాలని హైకోర్టును కోరారు.

హోంశాఖ తరఫు న్యాయవాది మహేశ్వరరెడ్డి వాదనలు వినిపిస్తూ.. పిటిషనర్‌పై క్రమశిక్షణ చర్యలు, క్రిమినల్‌ కేసు పెండింగ్‌లో ఉన్నాయని అన్నారు. అనుమతి ఇవ్వాలా లేదా అనేది సంబంధిత అధికారుల విచక్షణాధికార పరిధిలోని వ్యవహారం అని అన్నారు. సీఎస్‌ ఉత్తర్వులపై ఏదైనా అభ్యంతరం ఉంటే కేంద్ర పరిపాలన ట్రైబ్యునల్​ను ఆశ్రయించాలి కానీ.. హైకోర్టులో వ్యాజ్యం దాఖలు చేయడానికి వీల్లేదని పేర్కొన్నారు. వ్యాజ్యానికి విచారణ అర్హత లేదన్నారు.

విదేశాలకు వెళ్లేందుకు అనుమతి కోరుతూ వెంకటేశ్వరరావు చేసిన దరఖాస్తుపై 21 రోజులు నిర్ణయం తీసుకోకుండా.. విచక్షణాధికారం పేరుతో సెలవు విజ్ఞప్తిని తిరస్కరించడాన్ని ఏ విధంగా సమర్థించుకుంటారని ప్రభుత్వాన్ని ప్రశ్నించింది. దరఖాస్తుపై 21 రోజుల్లో నిర్ణయం వెల్లడించకపోతే.. అనుమతి లభించినట్లుగా భావించాల్సి ఉంటుందని చట్ట నిబంధనలు స్పష్టం చేస్తున్నాయని గుర్తు చేసింది.

ఈ నేపథ్యంలో విదేశాలకు వెళ్లేందుకు ఏబీ వెంకటేశ్వరరావుకు అనుమతి లభించాక.. ఆర్జిత సెలవులపై విదేశాలకు వేళ్లేందుకు అనుమతి నిరాకరించడం సరికాదని అభిప్రాయపడింది. విదేశాలకు ప్రయాణించడం పాథమిక, వ్యక్తిగత స్వేచ్ఛా హక్కుల్లో భాగమని.. మేనకాగాంధీ కేసులో సుప్రీంకోర్టు తీర్పు చెబుతోందని తెలిపింది. ఇరువైపు వాదనలు ముగియడంతో.. హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్‌ గన్నమనేని రామకృష్ణ ప్రసాద్‌ తీర్పును ఇవాళ్టికి వాయిదా వేశారు.

Last Updated : Jul 4, 2023, 11:20 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.