జలాశయానికి వరద ఉద్ధృతి భారీగా కొనసాగుతోంది. పులిచింతల జలాశయానికి ఇన్‌ఫ్లో, ఔట్‌ఫ్లో 4.46 లక్షల క్యూసెక్కులు ఉండగా... పూర్తి నీటినిల్వ 45.77 టీఎంసీలు ఉంది. నాగార్జున సాగర్ నుంచి పులిచింతలకు భారీగా వరద నీటిని విడుదల చేస్తుండటంతో 18 గేట్లను ఎత్తి నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు. ప్రస్తుతం పులిచింతలలో 17.94 టీఎంసీల నీటి నిల్వ ఉండగా...ప్రాజెక్టులో నీటిమట్టం పెరిగే కొద్ది తీర ప్రాంతాలు ముంపులోకి వెళ్తున్నాయి. దీంతో చిట్యాల తండా, కొల్లూరు, పులిచింతల ముంపు గ్రామాల ప్రజల్ని అధికారులు ముందే అప్రమత్తం చేసి ఇతర చోట్లకు తరలించారు. పైనుంచి వరద ఎక్కువగా ఉండటంతో నీటిని విడుదల చేస్తున్నట్లు నీటిని పారుదల శాఖ అధికారులు తెలిపారు.
ఇవీ చూడండి : నా ఫోన్‌ను కొండముచ్చు ఎత్తుకుపోయింది!