గుంటూరు జిల్లా చిలకలూరిపేట మండలంలో అరగంట సేపు భారీ వర్షం కురిసింది. మద్దిరాల, పోతవరం, యడవల్లి, కమ్మవారిపాలెం తదితర గ్రామాల్లో ఈదురు గాలులు, ఉరుములు, మెరుపులతో వానపడింది. రైతులకు తీవ్ర నష్టం వాటిల్లింది. విద్యుత్ స్తంభాలు విరిగి పడిపోయాయి. చాలా చోట్ల చెట్లు రహదారులపై అడ్డంగా కూలిపోయాయి. మునగ తోటలు, అరటి తోటలు దెబ్బతిన్నాయి.
ఇదీ చూడండి:
సంగం డెయిరీ కంపెనీ సెక్రటరీ సందీప్‌ని అదుపులోకి తీసుకున్న ఏసీబీ