హైకోర్టు తీర్పు నేపథ్యంలో ఎస్ఈసీగా నిమ్మగడ్డ రమేశ్ కుమార్ నియామకం చెల్లదంటూ దాఖలైన వ్యాజ్యం పై విచారణ జులై 8 కి వాయిదా పడింది. వ్యాజ్యానికి నంబరు కేటాయించే విషయంలో హైకోర్టు రిజిస్ట్రీ లేవనెత్తిన అభ్యంతరాలతో ధర్మాసనం విభేదించింది. వ్యాజ్యాన్ని విచారించేందుకు నిర్ణయించింది. హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ జేకే మహేశ్వరి, జస్టిస్ కె.లలితతో కూడిన ధర్మాసనం ఈ మేరకు ఆదేశాలు జారీచేసింది. రాష్ట్ర ఎన్నికల కమిషనర్ నియామకం గవర్నర్ విచక్షణాధికారం మేరకు జరగాలని, మంత్రి మండలికి పాత్ర ఉండదని హైకోర్టు తీర్పు నేపథ్యంలో ఎఈసీగా రమేశ్ కుమార్ నియామకం చెల్లదని గుంటూరు జిల్లాకు చెందిన సంగం శ్రీకాంత్ రెడ్డి హైకోర్టును ఆశ్రయించారు. మొదట్లో ఈ వ్యాజ్యానికి నంబరు కేటాయించేందుకు హైకోర్టు రిజిస్ట్రీ అభ్యంతరాలు లేవనెత్తింది. చివరికి నంబరు కేటాయించగా ధర్మాసనం ముందుకు విచారణకు వచ్చింది.
ఇదీ చదవండి: 'భారత్- చైనా' మధ్య 11 గంటల చర్చ ఎందుకంటే?