పీజీ మెడికల్ కౌన్సెలింగ్‌కు గతంలో ప్రభుత్వం జారీ చేసిన జీవో 43ను సవాల్ చేస్తూ హైకోర్టులో డాక్టర్ ఆలా వెంకటేశ్వర్లు దాఖలు చేసిన పిటిషన్పై విచారణ జరిగింది. కౌన్సెలింగ్లో ఓపెన్ కేటగిరిలో రిజర్వేషన్ విద్యార్ది సీట్ల కేటాయింపులో అన్యాయం జరుగుతోందని.. సుప్రీంకోర్టు గైడ్లెన్స్ పాటించడం లేదని పిటిషనర్ తరుపు న్యాయవాది శ్రవణ్ కుమార్ వాదించారు. ఓపెన్ కేటగిరిలో రిజర్వేషన్ అభ్యర్ధి వేరే కళాశాలలో సీటు పొంది వెళ్లిపోతే.. ఆ ఖాళీని ఓసి అభ్యర్ధితో భర్తీ చేస్తున్నారని న్యాయస్థానం దృష్టికి తీసుకెళ్లారు.
కౌన్సెలింగ్పై నూతన జీవో విడుదల చేశామని ప్రభుత్వ న్యాయవాది ధర్మాసనానికి తెలిపారు. నూతన జీవోలో పిటిషనర్ కోరిన విధంగా సవరణలు చేశామని ప్రభుత్వం తెలిపింది. మరోవైపు ఇదే అంశంలో ఓసి అభ్యర్ధి వేసిన ఇంప్లీడ్ పిటిషన్ ను న్యాయస్థానం స్వీకరించింది. తదుపరి విచారణ జూన్ 15 కు వాయిదా వేసింది.
ఇదీ చదవండి: రాష్ట్రంలో కొత్తగా 33 కరోనా కేసులు..ఒకరు మృతి