రాష్ట్రంలోని వైద్య, దంత కళాశాలల్లో జీవో నంబర్ 56 అమలుపై సామాజిక కార్యకర్త తోట సురేష్ బాబు వేసిన పిటిషన్పై హైకోర్టు విచారణ జరిపింది. ఎన్టీఆర్ ఆరోగ్య విశ్వవిద్యాలయం నిర్వహించిన కౌన్సెలింగ్లో ఎవరికైతే సీట్లు వచ్చాయో.. వారందరికీ ప్రవేశాలు కల్పించినట్లు యాజమాన్యాలు కోర్టుకు తెలిపాయి. అయితే ఫీజుల విషయం ఇంకా తేలలేదు కాబట్టి కోర్టు తీర్పు ప్రకారం ఫీజు చెల్లించేలా.. వారి నుంచి ఒప్పంద పత్రం తీసుకున్నట్లు వివరించారు. దీనిపైన కౌంటర్ దాఖలు చేయాలని ఇరు పక్షాలను హైకోర్టు ఆదేశిస్తూ తుది విచారణ వాయిదా వేసినట్లు న్యాయవాది శ్రీనివాస్ తెలిపారు.
ఇదీ చదవండి: గవర్నర్ ఆదేశాలిచ్చినా పోస్టింగ్ ఇవ్వకపోవటం దారుణం:సుప్రీం