ETV Bharat / state

Twitter Trending రజనీకాంత్​పై వైసీపీ విమర్శలు.. క్షమాపణ చెప్పాలంటూ ట్విట్టర్లో భారీగా పోస్టులు - Kodali Nani criticizes Rajinikanth

YSRCPApologizeRAJINI Twitter Trending: తమిళ సినీ సూపర్ స్టార్​పై వైసీపీ నేతల విమర్శలపై.. రజనీ ఫ్యాన్స్ గరం గరం అవుతున్నారు. ఎన్టీఆర్ శతజయంతి ఉత్సవాల కోసం విజయవాడ వచ్చిన రజనీ.. తన ఆప్త మిత్రుడు చంద్రబాబును పొగడటంపై.. వైసీపీ నేతలు దిగజారుడు ఆరోపణలు చేస్తున్నారని, ఫ్యాన్స్ మండిపడుతున్నారు. YSRCPApologizeRAJINI అంటూ.. ట్విట్టర్లో పోస్టులు పెడుతూ, వైసీపీ నేతల వ్యవహారంపై మీమ్స్ ను వైరల్ చేస్తున్నారు. వైసీపీ నేతలు రజనీకాంత్​కు క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేస్తున్నారు.

rajinikanth
రజనీకాంత్
author img

By

Published : Apr 30, 2023, 8:00 PM IST

Updated : May 1, 2023, 6:52 AM IST

YSRCPApologizeRAJINI Twitter Trending: వైసీపీ నాయకులకు వ్యతిరేకంగా తమిళ సినీ సూపర్ స్టార్ రజనీ ఫ్యాన్స్ ట్విట్టర్​లో భారీగా పోస్టులు పెడుతున్నారు. ఎన్టీఆర్ శతజయంతి ఉత్సవాల కోసం విజయవాడ వచ్చిన రజనీకాంత్ ఎలాంటి రాజకీయ ప్రసంగాలు చేయకపోయినా.. వైసీపీ నేతలు దిగజారుడు విమర్శలు చేస్తున్నారని ఫ్యాన్స్ మండిపడుతున్నారు. అధికార పార్టీపై ఒక్క విమర్శ చేయలేదు.. కేవలం తన చిరకాల మిత్రుడైన చంద్రబాబు విజన్​పై మాట్లాడిన రజనీపై రాజకీయ బురద జల్లడం ఏమిటని ప్రశ్నిస్తున్నారు. వైఎస్సార్సీపీ నేతలు రజకీకాంత్​కు క్షమాపణలు చెప్పాలనే హ్యాష్ ట్యాగ్ ట్విట్టర్​లో విపరీతంగా ట్రెండ్ంగ్ అవుతోంది. ఆదివారం మధ్యాహ్నం సమయానికే 22 వేల ట్వీట్లు పోస్టు చేశారు.

కేవలం తన ఆప్తమిత్రుడైన చంద్రబాబు దూరదృష్టిని మెచ్చుకున్న రజనీకాంత్‌పై వైసీపీ నేతలు దారుణంగా మాట్లాడటం సరికాదనే విమర్శలు వెల్లువెత్తాయి. మాజీ మంత్రి కొడాలి నాని, మంత్రి రోజా తో పాటు మరికొందరు నేతలు.. రజనీకాంత్‌ను పరుషంగా మాట్లాడారు. ఇది రజనీ ఫ్యాన్స్ తీవ్ర ఆగ్రహం తెప్పించింది. అటు టీడీపీ నేతలు కూడా వైసీపీ నేతల వ్యవహార శైలిపై తీవ్రంగా స్పందించారు. ఎంతో మంచి వ్యక్తిత్వం కలిగిన రజనీకాంత్​ని సైతం తిట్టించే స్థాయికి జగన్ దిగజారారని నేతలు దుయ్యబట్టారు. తాజాగా సామాజిక మాధ్యమాలలో కూడా వైఎస్సార్సీపీ నేతల వైఖరికి వ్యతిరేకంగా.. పెద్ద ఎత్తున ప్రజలు పోస్టులు పెడుతున్నారు. వైసీపీ నేతలు రజనీకాంత్​కు క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేస్తున్నారు.

నాన్నా పందులే గుంపుగా వస్తాయి: రజనీకాంత్​ని సపోర్ట్ చేస్తూ.. వివిధ రకాలు మీమ్స్ క్రియేట్ చేస్తూ.. వైసీపీ నాయకులను ఒక ఆట ఆడుకుంటున్నారు. పలు సినిమా డైలాగులు జోడించి మీమ్స్ పెడుతూ.. వైసీపీ నేతలను ట్రోల్ చేస్తున్నారు. రజనీకాంత్ నటించిన శివాజీ మూవీలోని 'నాన్నా పందులే గుంపుగా వస్తాయి.. సింహం సింగిల్​గా వస్తుంది' అనే డైలాగ్​కు వైసీపీ నేతల ఫోటోలు జోడించి మీమ్స్ క్రియేట్ చేశారు.

జైలర్.. ఖైదీ: రజనీకాంత్ నటిస్తున్న జైలర్ మూవీతో కూడా మీమ్స్ క్రియేట్ చేశారు. జైలర్, ఖైదీ అంటూ వైసీపీ నాయకుల ఫోటోలు పెడుతున్నారు. జైలర్​గా రజనీకాంత్​, ఖైదీగా జగన్ ఫోటోలు పెట్టి.. వైఎస్ జగన్ మోహన్ రెడ్డి క్షమాపణలు చెప్పాలి అని డిమాండ్ చేస్తున్నారు. రజనీకాంత్ ఒక్కడే అయినా సరే.. అతని కోసం ప్రాణాలు ఇవ్వడానికి అనేక మంది అభిమానులు సిద్ధంగా ఉన్నారని అంటున్నారు.

చంద్రబాబు, రజనీకాంత్ స్నేహం: చంద్రబాబు, రజనీకాంత్ స్నేహం ఇప్పటిది కాదు అని తెలియజేస్తూ.. గతంలో వీరిద్దరూ కలిసి ఉన్న ఫోటోలను షేర్ చేస్తున్నారు. ఎవరు ఎన్ని విమర్శలు చేసినా వీరి బంధాన్ని విడదీయలేరని పేర్కొంటున్నారు.

ఇంతకీ రజనీకాంత్ ఏం అన్నారంటే: చంద్రబాబు ఒక దీర్ఘదర్శి అని, న్యూయార్క్‌ నగరాన్ని తలపించేలా హైదరాబాద్​ను తీర్చిదిద్దడంలో ఆయన కృషి ఎంతో ఉందని సూపర్‌స్టార్‌ రజనీకాంత్‌ కొనియాడారు. చంద్రబాబు విజన్ 2047 గురించి చెప్పారని.. అని సాకారమైతే ఆంధ్రప్రదేశ్ దేశంలోనే అగ్రస్థానంలో ఉంటుందని అన్నారు. ఆయన ప్రణాళికలు అమలు కావాలని కోరుటుంటున్నట్లు తెలిపారు.

ఇవీ చదవండి:

Last Updated : May 1, 2023, 6:52 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.