గుంటూరులో జాతీయ మిర్చి పరిశోధన కేంద్రం ఏర్పాటు చేయాలని భాజపా ఎంపీ జీవీఎల్ నరసింహారావు రాజ్యసభలో కోరారు. అత్యధిక మిర్చి పంట పండించే దేశం భారతదేశమని ఆయన గుర్తుచేశారు. ప్రపంచం ఉత్పత్తిలో 40శాతం మిర్చి భారత్‌లో పండుతుందని.. దేశ ఉత్పత్తిలో వాటాగా ఏపీలోనే 40 శాతం మిర్చి లభ్యమవుతుందని ఆయన అన్నారు.
మిర్చి పంటకు గుంటూరు ప్రధాన కేంద్రమని.. కొత్త వంగడాల అభివృద్ధికి ఇది ఎంతగానో ఉపయోగపడుతుందని ఆయన పేర్కొన్నారు. మిర్చి పంట కోసం జాతీయ పరిశోధన కేంద్రం ఏర్పాటు చేయాల్సిన అవసరం ఉందని ఆయన అభిప్రాయపడ్డారు.
ఇదీ చూడండి. సర్పంచి పోరులో 80 ఏళ్ల బామ్మ