గుంటూరు జిల్లాలో బయటపడిన కరోనా కేసులు మాచర్లకు చెందినవిగా తెలియడం వల్ల అధికారులు అప్రమత్తమయ్యారు. ప్రత్యేక అధికారి గజ్జల శ్రీనివాస రెడ్డి.. కరోనా పరిస్థితిపై అధికారులు, వైద్యులతో సమావేశం నిర్వహించారు. కరోనా పాజిటివ్ వచ్చిన ఇద్దరు వ్యక్తులు వెళ్లిన ప్రాంతాలు, ఎవరెవరిని కలిశారనే వివరాలు.. వారి ఆరోగ్య పరిస్థితిపై ఆరా తీశారు. మాచర్లలో పాజిటీవ్ వచ్చిన వ్యక్తులు సంచరించినప్పుడు కలిసిన 30 మంది అనుమానిత వ్యక్తులను ముందు జాగ్రత్తగా అంబులెన్సుల ద్వారా కాటూరి మెడికల్ కళాశాలలోని ఐసోలేషన్ కేంద్రానికి పరీక్షల నిమిత్తం తరలించారు. బాధితులు నివసించే ప్రాంతాల్లో ఇంటింటి సర్వే నిర్వహించి.. బ్లీచింగ్ పౌడర్ పిచికారీ చేశారు. ఆ ప్రాంత వాసుల ఆరోగ్య పరిస్థితిపై ఆరా తీసిన వైద్య సిబ్బంది.. 8 మందిని గుంటూరు తరలించారు.
ఇదీ చూడండి: