కర్ణాటక నుంచి గుట్కాలను అక్రమంగా రవాణా చేస్తున్న లారీని గుంటూరు జిల్లా తెనాలి పోలీసులు పట్టుకున్నారు. తవుడు బస్తాల మధ్య గుట్కా ప్యాకెట్లు ఉంచి రవాణా చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు. సుమారు 100 బస్తాల సరుకును స్వాధీనం చేసుకున్నారు. వీటి విలువ రూ. 15 లక్షలు ఉంటుందని సీఐ రవికృష్ణ తెలిపారు. ముందస్తు సమాచారం మేరకు పాత బస్టాండ్ వద్ద తనిఖీలు చేస్తుండగా గుట్కాలు పట్టుబడ్డాయని, లారీని స్వాధీనం చేసుకుని ఇద్దరిని అదుపులోకి తీసుకున్నామన్నారు.
ఇదీ చదవండి : గూడూరులో గుట్కా తరలిస్తున్న ముగ్గురు అరెస్ట్