గుంటూరు జిల్లా గురజాల డివిజన్ పరిధిలో ఇంటింటికి నిత్యావసర సరుకుల పంపిణీపై ఆర్డీవో కార్యాలయంలో ఏర్పాటు చేసిన కంట్రోల్ విభాగంలో ఆర్డీఓ పార్థసారథి గత మూడు రోజులుగా స్వయంగా పర్యవేక్షిస్తున్నారు. డివిజన్లోని పలు మండలాలు, మున్సిపాలిటీల్లో, గ్రామాల్లో పంపిణీలను కంట్రోల్ రూం నుంచి ఆయన పరిశీలిస్తున్నారు.
ఆయా మండలాల్లోని మున్సిపాలిటీ కేంద్రాల్లోని తహసీల్దార్, ఎంపీడీవో కార్యాలయాల్లో ఏర్పాటుచేసిన కంట్రోల్ రూంలో సంబంధిత అధికారి నిరంతరం పర్యవేక్షణ నిర్వహించాలని ఆయన తెలిపారు. డోర్ డెలివరీ ద్వారా నిత్యావసర సరుకులు పంపిణీ అనంతరం సంబంధిత వాహనం ఆయా గ్రామాల్లోని గ్రామ సచివాలయం వద్ద ఉంటుందని ఆర్టీఓ పేర్కొన్నారు. ఉదయం 7 గంటల నుంచే తహసీల్దార్లు సరుకుల పంపిణీ పర్యవేక్షణ చేస్తున్నట్లు తెలియజేశారు.
ఇదీ చదవండి: