ETV Bharat / state

గుంటూరు అర్బన్​లో 8మంది పోలీసులపై చర్యలు - NALLAPADU PS

గుంటూరు అర్బన్ పరిధిలో ఇద్దరు ఎస్సైలను, 8 మంది కానిస్టేబుళ్లను వి.ఆర్ కి పంపుతూ అర్బన్ ఎస్పీ రామకృష్ణ ఆదేశాలు జారీ చేశారు. నల్లపాడు ఎస్సై సుబ్బారావు, లాలాపేట ఎస్సై రవీంద్ర తో పాటు మరో 8 మంది కానిస్టేబుళ్ల పై వచ్చిన అవినీతి ఆరోపణలు పై శాఖ పరమైన విచారణ జరిపించారు. పోలీస్ స్టేషన్ కి వచ్చే వారి నుంచి లంచాలు డిమాండ్ చేయడంతో పాటు స్టేషన్ పరిధిలో వసూళ్లకు పాలపడుతున్నట్లు తేలడంతో అర్బన్ ఎస్పీ రామకృష్ణ చర్యలు తీసుకున్నారు. గుంటూరు అర్బన్ పరిధిలో ఇద్దరు ఎస్సై లు , 8 మంది కానిస్టేబుల్ పై ఒకే రోజున చర్యలు తీసుకొవడం.. గుంటూరు జిల్లా పోలీసులలో కలకలం రేపింది.

GUNTUR URBAN SP SENT 8POLICE to VR
గుంటూరు అర్బన్​లో 8మంది పోలీసులపై చర్యలు
author img

By

Published : Feb 19, 2020, 10:02 PM IST

గుంటూరు అర్బన్​లో 8మంది పోలీసులపై చర్యలు

గుంటూరు అర్బన్​లో 8మంది పోలీసులపై చర్యలు

. ఇదీ చదవండి .. చంద్రబాబుకు భద్రతను తగ్గించలేదు: హోంమంత్రి

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.