ETV Bharat / state

'ప్రజా సేవలో ప్రతి ఒక్కరూ పోలీసుల్లా వ్యవహరించాలి' - గ్రామ రక్షక దళం తాజా న్యూస్

గుంటూరు జిల్లా మేడికొండూరు మండలంలో కొత్తగా ఏర్పాటు చేసిన గ్రామ రక్షక దళం సభ్యులకు.. అధికారులు కిట్లు అందించారు. అర్బన్ ఎస్పీ అమ్మిరెడ్డి ముఖ్య అతిథిగా హాజరయ్యారు.

Guntur Urban SP Ammireddy participating in the program of distributing kits to the members of grama rakshaka dhalam
'ప్రజలకు సేవ చేయడంలో ప్రతి ఒక్కరూ పోలీసులా వ్యవహరించాలి'
author img

By

Published : Jan 24, 2021, 11:33 AM IST

కొత్తగా ఏర్పాటు చేసిన గ్రామ రక్షక దళం సభ్యులకు కిట్ల పంపిణీ కార్యక్రమాన్ని గుంటూరు జిల్లా మేడికొండూరు మండలంలోని జడ్పీ పాఠశాలలో అధికారులు నిర్వహించారు. ఈ సమావేశానికి ముఖ్యఅతిథిగా గుంటూరు అర్బన్ ఎస్పీ అమ్మిరెడ్డి హాజరయ్యారు. ప్రజలకు సేవ చేయడంలో ప్రతి ఒక్కరూ.. పోలీసుల్లా వ్యవహరించాలని ఎస్పీ తెలిపారు.

గ్రామాల్లో ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా చూడాలన్నారు. ప్రార్థనా మందిరాలపై రక్షక దళం దృష్టి పెట్టాలని సూచించారు. విధుల గురించి డీఎస్పీ ప్రశాంతి అవగాహన కల్పించారు. మొత్తం 135 మందిని సభ్యులుగా నియమించినట్లు సీఐ ఆనంద్ తెలిపారు. ఈ కార్యక్రమంలో ఎస్సై నరహరి, పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు.

ఇదీ చదవండి:

అక్రమంగా తరలిస్తున్న 35 కేసుల మద్యం పట్టివేత

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.