జగన్ ప్రభుత్వం మొదటి ఏడాదిలోనే కుంభకోణాలకు చిరునామాగా మారిందని గుంటూరు జిల్లా తెదేపా నాయకులు విమర్శించారు. మద్యం, మట్టి, ఇసుక, ఇళ్ల పట్టాలు, బ్లీచింగ్ పౌడర్లలో ఆ పార్టీ నేతలు కోట్ల రూపాయల అక్రమాలకు పాల్పడ్డారని నేతలు ఆరోపించారు. 108 వాహనాల కొనుగోళ్లలో 307 కోట్లు ప్రజాధనాన్ని వైకాపా నేతలు దోపిడీ చేశారన్నారు.
అనుభవం ఉన్న కంపెనీని పక్కనపెట్టి తమకు అనుకూలంగా నడిచే అరవిందో ఫౌండేషన్‌కి 108 వాహనాల నిర్వహణ బాధ్యతలను అప్పగించారని మండిపడ్డారు. అరవిందో ఫౌండేషన్ చైర్మన్ రాంప్రసాద్ రెడ్డి, ఎంపీ విజయసాయిరెడ్డి వియ్యంకులు కాదా అని నేతలు ప్రశ్నించారు.