గ్రామాల్లో శాంతి భద్రతలకు విఘాతం కలిగిస్తే కఠిన చర్యలు తప్పవని గుంటూరు రూరల్ ఎస్పీ రాజశేఖర్‌బాబు హెచ్చరించారు. ఇటీవల జరిగిన ఘర్షనల్లో గొడవపెట్టుకున్న ఇరువర్గాలతో మాట్లాడిన ఆయన వారికి సర్ది చెప్పారు. అల్లర్లు జరుగుతాయని ఊహించిన గ్రామాల్లో పోలీస్ పికెట్స్ ఏర్పాటు చేశామని చెప్పారు. ఇకనుంచి అల్లర్లు జరగితే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ఎన్నికల సమయంలో ఉత్తమంగా విధులు నిర్వర్తించిన సత్తెనపల్లి, గురజాల డీఎస్పీలను, సిబ్బందిని అభినందించారు.
ఇదీ చదవండి...: మా సమావేశం అద్భుతం.. అందిస్తా సహకారం: మోదీ