ETV Bharat / state

వరుస చోరీలకు పాల్పడుతున్న ముగ్గురు దొంగలు అరెస్ట్

వరుస దోపిడీలకు పాల్పడుతున్న ముగ్గురు దొంగలను గుంటూరులోని నల్లపాడు పోలీసులు అరెస్ట్ చేశారు. వారి నుంచి 30 గ్రాముల బంగారం, ద్విచక్రవాహనం స్వాధీనం చేసుకున్నారు.

వరుస చోరీలకు పాల్పడుతున్న ముగ్గురు దొంగల అరెస్ట్

author img

By

Published : May 22, 2021, 11:33 AM IST

ఒంటరిగా ఉండే మహిళల మెడలో బంగారపు వస్తువులు దోపిడీ చేస్తున్న ముగ్గురిని గుంటూరులోని నల్లపాడు పోలీసులు అరెస్ట్ చేశారు. వారి నుంచి 30 గ్రాముల బంగారపు వస్తువులు, ద్విచక్ర వాహనం స్వాధీనం చేసుకున్నారు. నిందితుల వివరాలను అర్బన్ ఎస్పీ అమ్మిరెడ్డి తెలిపారు. మే 10న విద్యానగర్ మూడో లైన్​లోని ఓ ఇంట్లో వృద్ధురాలిని బెదిరించి బంగారపు మంగళసూత్రం, గొలుసు దోచుకెళ్లిన వైనంపై బాధితురాలు పోలీసులకు ఫిర్యాదు చేసింది.

మే 19 న జేకేసీ కళాశాల రోడ్డులో నడుచుకుంటూ వెళ్తున్న మహిళ మెడలో బంగారపు ఆభరణాలు తెంచుకెళ్లిన ఘటనపై కేసు నమోదైంది. నేర విభాగం ఏఎస్పీ మనోహరరావు, డీఎస్పీ ప్రశాంతి, సీఐ ప్రేమయ్య.. దర్యాప్తు చేసి ముగ్గురిని నిందితులుగా గుర్తించారు. నగరంపాలేనికి చెందిన పఠాన్ మహబూబ్ సుభాని, వల్లేరు క్రాంతి, కుర్రా అనిల్ కుమార్​.. వ్యసనాలను బానిసలయ్యారు. అడ్డదారిలో డబ్బులు సంపాదించాలని ఒంటరిగా ఉండే మహిళలను లక్ష్యంగా చేసుకొని బంగారపు వస్తువులు దోపిడీలకు పాల్పడుతుండేవాళ్లు.

దోచుకున్న నగదును శుక్రవారం జేకేసీ రోడ్డులో పంచుకుంటున్నారనే సమాచారంతో పోలీసులు పట్టుకున్నారు. వీరు ద్విచక్రవాహనం నంబర్ ప్లేట్ తీసేసి నేరాలు చేస్తుంటారని, విద్యానగర్, జేకేసీ రోడ్డులో జరిగిన ఘటనల్లో దోపిడీలకు పాల్పడినట్లు తేలడంతో వారి వద్ద నుంచి 30 గ్రాముల బంగారపు వస్తువులు, ద్విచక్రవాహనం జప్తు చేసినట్లు ఎస్పీ తెలిపారు. నిందుతులను పట్టుకున్న సీఐతో పాటు ఎస్సై మహేశ్, సిబ్బంది పోతురాజు, ఆదిబాబు, జాన్​సైదా, సంగం నాయడు, హుస్సేన్ బాషాలను ఎస్పీ రివార్డులు అందించి అభినందించారు.

ఇదీ చదవండి:

ఆనందయ్య మందు.. ఈరోజు బంద్

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.