ETV Bharat / state

'స్వచ్ఛ సర్వేక్షణ్‌- 2021లో గుంటూరు మంచి స్థానాన్ని పొందడమే లక్ష్యం' - గుంటూరు వార్తలు

గుంటూరును స్వచ్ఛ నగరంగా నిలిపేందుకు అధికారులు సన్నాహాలు చేస్తున్నారు. రహదారుల సుందరీకరణ, పరిసరాల పరిశుభ్రత, చెత్త నిర్వహణ వంటి అంశాలపై దృష్టి సారించారు. పాత పొరబాట్లను సవరించుకుని స్వచ్ఛ సర్వేక్షణ్‌- 2021లో మెరుగైన స్థానాన్ని సాధించే దిశగా పనిచేస్తున్నట్లు అధికారులు చెబుతున్నారు.

swacha sarvekshan in guntur
'స్వచ్ఛ సర్వేక్షణ్‌- 2021లో గుంటూరు మంచి స్థానాన్ని పొందడమే లక్ష్యం'
author img

By

Published : Dec 20, 2020, 6:44 PM IST

'స్వచ్ఛ సర్వేక్షణ్‌- 2021లో గుంటూరు మంచి స్థానాన్ని పొందడమే లక్ష్యం'

స్వచ్ఛత విషయంలో అంతంతమాత్రంగానే ఉన్న గుంటూరు నగరాన్ని.. ఈసారి స్వచ్ఛ పోటీల్లో మెరుగైన స్థానంలో నిలిపేందుకు అధికారులు కృషి చేస్తున్నారు. ఇదివరకే ఇంటింటి చెత్త సేకరణ చేపట్టి.. ఇంటి నుంచే తడి చెత్త ద్వారా ఎరువు తయారు చేసుకునేలా అవగాహన కల్పించారు. ఏడాది పాటు తీసుకున్న చొరవతో దాదాపు 30వేల గృహాల్లో హోం కంపోస్టు విధానం అమల్లోకి తీసుకొచ్చారు. మార్కెట్లు, ఇతర ప్రదేశాల నుంచి సేకరించే చెత్త ద్వారా ఎరువు తయారు చేయించి.. పార్కులు, రోడ్ల వెంట మొక్కలు పెంచేందుకు ఉపయోగిస్తున్నారు.

నగరంలో రహదారుల మరమ్మత్తులు, భూగర్భ డ్రైనేజికి సంబంధించిన పనులపైనా అధికారులు దృష్టి సారించారు. రాకపోకలు ఎక్కువగా ఉండే ప్రాంతాల్లో పనులు చేపట్టారు. స్వచ్ఛ సర్వేక్షణ్- 2021లో అత్యుత్తమ స్థానాన్ని సాధించాలనే లక్ష్యంతో పనిచేస్తున్నట్లు అధికారులు చెబుతున్నారు.

స్వచ్ఛ కార్యక్రమాల్లో భాగంగా నగరంలోని ప్రజా మరుగుదొడ్లను ఆధునీకరించారు. ఎక్కడా బహిరంగ మల, మూత్ర విసర్జన లేకుండా చర్యలు తీసుకుంటున్నారు. డ్రైనేజీ సమస్యల పరిష్కారం కోసం బృందాలు ఏర్పాటు చేశారు. ప్లాస్టిక్ నుంచి ఇంధన తయారీకి ప్రత్యేక ప్లాంటు ఏర్పాటు చేశారు. చెత్తను వీలైనంత మేర సద్వినియోగం చేసుకుని జీరో వేస్టేజ్ దిశగా కృషి చేస్తున్నారు.

ఇదీ చదవండి:

ఎగుమతుల్లో గుంటూరు మిర్చికి ప్రత్యేక స్థానం

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.