ETV Bharat / state

AT Agraharam: ఏటీ అగ్రహారం పేరు మర్పుపై మున్సిపల్​ కమిషనర్ ఏమన్నారంటే..!

author img

By

Published : May 4, 2023, 5:25 PM IST

AT Agraharam name Change: గుంటూరు నగరంలోని ఏటీ అగ్రహారం పేరు మర్పుపై రగడ కొనసాగుతున్న వేళ, నగరపాలక సంస్థ కమిషనర్ చేకూరి కీర్తి స్పందించారు. కింది స్థాయి అధికారుల సమన్వయ లోపం వల్లే ఇబ్బుదులు తలెత్తినట్లు తెలిపారు. ఈ ఘటనపై విచారణ చేసి పూర్తి నివేదిక అందించాలని ప్రణాళిక అధికారులను ఆదేశించినట్లు కమిషనర్ పేర్కొన్నారు.

at agraharam
ఏటీ అగ్రహారం

AT Agraharam name Change in Guntur: రోడ్లు, వీధులు, భవనాల పేర్లు మార్చడం ఈ మధ్య కాలంలో పరిపాటిగా మారిపోయింది. అయితే, స్థానికుల అభిప్రాయాలతో పాటుగా.. ఆ పేరుకు గల చారిత్రక నేపథ్యాలను, ప్రభుత్వాలు పట్టించుకోవడం లేదంటూ విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. పేరు మార్పు అంశంపై గుంటారు జిల్లాలో ఉద్రిక్తతలు నెలకొన్నాయి. నగంరంలో అధికారుల నిర్లక్ష్యంతో స్థానిక ఏటీ అగ్రహారం పేరును ఫాతిమా నగర్​గా మార్చిన నేపథ్యంలో స్థానికంగా ఆందోళనలు వ్యక్తం అయ్యాయి. ఇదే అంశంపై నగర పాలక సంస్థ కమిషనర్ స్పందించారు. ఇది కేవలం అనుకోకుండా జరిగిన తప్పిదమని వెల్లడించారు. కింది స్థాయి ఉద్యోగుల సమన్వయ లోపంతోనే తప్పిదం జరిగిందని కమిషనర్ చేకూరి కీర్తి తెలిపారు.

పేరు మర్పులపై స్పందించిన నగర కమిషనర్: గుంటూరులోని ఏటీ అగ్రహారంలో పేరు మార్పు బోర్డుల వ్యవహారం అవగాహనాలోపంతో జరిగిందని నగరపాలక సంస్థ కమిషనర్ చేకూరి కీర్తి తెలిపారు. ఏటీ అగ్రహారం 2 లైన్ సూచిక బోర్డ్ పేరు మార్పుపై ఆమె వివరణ ఇచ్చారు. ఏటీ అగ్రహారం పక్కనే ఉన్న ఫాతిమా నగర్ ఉంటుందని... అక్కడ ఏర్పాటు చేయాల్సిన బోర్డుని పట్టణ ప్రణాళిక విభాగానికి చెందిన కింది స్థాయి సిబ్బంది అవగాహన లోపంతో ఏటీ అగ్రహారంలో పెట్టారని వివరించారు. విషయం తెలిసిన తర్వాత బోర్డుని వెంటనే తొలగించామని కమిషనర్ తెలిపారు. ఈ ఘటనపై విచారణ చేసి పూర్తి నివేదిక అందించాలని ప్రణాళిక అధికారులను కమిషనర్ ఆదేశించారు. ప్రజల మనోభావాలకు భిన్నంగా జీఎంసీ ఎటువంటి చర్యలు తీసుకోదని కమిషనర్ చేకూరి కీర్తి స్పష్టం చేశారు.

ఇదీ జరిగింది: గుంటూరు నగరంలో స్థానిక వీధుల పేర్ల మార్పు స్థానిక ప్రజల్లో కలకలం రేపుతోంది. గుంటూరు నగరంలో ఏటీ అగ్రహారంలోని రెండు వీధులకు ఫాతిమా నగర్ అంటూ కార్పొరేట్ సిబ్బంది బోర్డులు ఏర్పాటు చేశారు. బోర్డులు ఏర్పాటు చేయడంలో స్థానికులలో అభ్యంతరాలు వెల్లువెత్తుతున్నాయి. కార్పొరేట్ సిబ్బందికి ఫిర్యాదు చేసినా అధికారులు బోర్డులను తొలగించలేదు. దీంతో ఆగ్రహించిన స్థానికులు అధికారులు ఏర్పాటు చేసిన బోర్డు స్టిక్కర్​లను చింపివేసి తొలగించారు. వాటి స్థానంలో యథాతధంగా ఏటీ ఆగ్రహారం ఒకటవ, రెండవ వీధి, అంటూ రాసి ఉంచారు. సమీపంలోని శ్రీరామ్​నగర్ పేరు కూడా​ చైతన్య నగర్​గా పేరు మార్చడంపై స్థానికులు అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. కౌన్సిల్ తీర్మానం లేకుండా పేరు ఇలా మార్పు సరి కాదంటూ స్థానిక ప్రజలు చెప్పుకొస్తున్నారు. దీంతో వీధుల పేరు మార్పుపై సామాజిక మాధ్యమాల్లో విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.

ఇవీ చదవండి:

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.