గుంటూరు ప్రభుత్వ ఆసుపత్రి భద్రతా సిబ్బంది విధులు బహిష్కరించారు. జీతాల కోసం ఆందోళన బాట పట్టారు. తమకు 3 నెలలుగా ఉన్నతాధికారులు జీతాలు చెల్లించడం లేదని జిల్లా పరిషత్ కార్యాలయం వద్ద నిరసనకు దిగారు. ఓ స్థానిక సంస్థ ద్వారా తాత్కాలిక ఉద్యోగులుగా నియమితులైన తమకు గత మూడు నెలలుగా వేతనాలు ఇవ్వడంలేదని వాపోయారు. చాలీచాలని జీతాలతో బతికే తమకు...4 నెలలకు, 6 నెలలుకు ఒకోసారి వేతనం ఇస్తే ఎలా అని ఆవేదన వ్యక్తం చేశారు. తమ సమస్యలను జిల్లా పరిపాలనాధికారులు తక్షణమే పరిష్కరించాలని వేడుకున్నారు.
ఇదీ చదవండి : గుంతలో పడిన గోమాత..ప్రొక్లైన్ సాయంతో బయటకు