గుంటూరు జిల్లా మంగళగిరిలో కరోనా పాజిటివ్ కేసు నమోదుపై అధికారులు ముందస్తు చర్యలు చేపట్టారు. దిల్లీ నిజాముద్దీన్ ప్రార్థనలో పాల్గొన్న ఇద్దరిలో ఒకరికి పాజిటివ్ రాగా మరొకరు క్వారంటైన్లో ఉన్నారు. పాజిటివ్ కేసు నమోదైన టిప్పర్ల బజార్ నుంచి అధికారులు మూడు కిలోమీటర్ల పరిధిలో ఉన్న ప్రాంతాన్ని రెడ్ జోన్‌గా ప్రకటించారు. మంగళగిరిలో ఉదయం నుంచే తెరిచి ఉన్న నిత్యావసర, కూరగాయల దుకాణాలను మూయించారు. 144 సెక్షన్‌ను పక్కాగా అమలు చేస్తున్నారు. పట్టణం మొత్తం హైపో ద్రావకం చల్లుతున్నారు. పోలీసులు మైక్‌లో విస్తృతంగా ప్రచారం చేపట్టారు. మంగళగిరి రెడ్‌జోన్‌లో ఉన్నందున ఎవరూ బయటకు రావద్దని పోలీసులు హెచ్చరించారు.
తాడికొండ నియోజకవర్గంలోని మేడికొండూరు మండలం తురకపాలెం రెడ్‌జోన్‌గా ప్రకటించారు. గ్రామానికి చెందిన ఒకరికి కరోనా పాజిటివ్ అని తేలడంపై.. అధికారులు ముందు జాగ్రత్తలు తీసుకున్నారు. గ్రామంలో బ్లీచింగ్ చల్లారు. ఇళ్ల నుంచి ఎవరూ బయటకు రావొద్దని హెచ్చరికలు జారీ చేశారు.
వీటితో పాటు.. అచ్చంపేట, క్రోసూరులను రెడ్‌జోన్లుగా అధికారులు ప్రకటించారు.
ఇదీ చూడండి: