ఇక నుంచి ప్రతి వాహనానికి హై సెక్యూరిటీ నంబర్ ప్లేట్ (high security number plate) ఉండాల్సిందేనని గుంటూరు జిల్లా ఉప రవాణా శాఖ కమిషనర్ మీరాప్రసాద్(Guntur District Deputy Transport Commissioner Meera Prasad) తెలిపారు. సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు 2015 నుంచే హై సెక్యూరిటీ నంబర్ ప్లేట్లు వినియోస్తున్నారు. అయితే అంతకు ముందు కొనుగోలు చేసిన వాహనాలకు పాత తరహా నంబర్ ప్లేట్లు మాత్రమే ఉంటున్నాయన్నారు. వాటిని కూడా వాహనదారులు మార్చుకోవాలని రవాణాశాఖ అధికారులు సూచిస్తున్నారు. లేకపోతే చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.
వాహన డీలర్ల వద్ద లేదా ప్రభుత్వం నుంచి అనుమతి పొందిన ఏజెన్సీల ద్వారా నంబర్ ప్లేట్లు తీసుకోవచ్చని అధికారులు తెలిపారు. ముందుగా ప్రభుత్వ వాహనాలతోనే ఈ నంబర్ ప్లేట్ల మార్పిడి ప్రారంభిస్తున్నట్లు మీరాప్రసాద్ తెలిపారు. కొవిడ్ కారణంగా చాలామంది వాహనదారులు ఫిట్ నెస్, పర్మిట్, కాలుష్య నియంత్రణ ధ్రువపత్రాలు రెన్యూవల్ చేయలేదని వారంతా త్వరగా అప్డేట్ చేసుకోవాలని సూచించారు. అలాగే పన్నుల బకాయిలు లేకుండా చూసుకోవాలన్నారు.
ఇదీ చదవండి