కరోనాపై సామాజిక మాధ్యమాల్లో వస్తున్న ప్రచారాలను నమ్మొద్దని గుంటూరు కలెక్టర్ శామ్యూల్ ఆనంద్ కుమార్ అన్నారు. జిల్లాలో ఇంత వరకు కరోనా పాజిటివ్ కేసులు ఒక్కటి కూడా నమోదు కాలేదని.. కేవలం అనుమానితులే ఉన్నారని స్పష్టం చేశారు. అనుమానితుల నుంచి సేకరించిన రక్త నమూనాలను తిరుపతి ల్యాబ్‌కు పంపినట్లు తెలిపారు. మాస్కుల ధరలు అధికంగా అమ్మితే కఠిన చర్యలు తీసుకుంటామని వ్యాపారులను హెచ్చరించారు.
జిల్లా స్థాయిలో నోడల్ అధికారిగా సంయుక్త కలెక్టర్ వ్యవహరిస్తారని.. వారు చెప్పిన సమాచారమే అధికారికమని వెల్లడించారు. ప్రజలు కరోనా పట్ల అప్రమత్తంగా ఉండాలని.. శుభ్రతను పాటించాలని సూచించారు. విదేశాల నుంచి వచ్చిన వారి వివరాలను సేకరించామన్నారు. అటువంటి వారిని హోం ఐసోలేషన్‌లో ఉంచి పర్యవేక్షిస్తున్నట్లు తెలిపారు. ఆశా వర్కర్లు, వాలంటీర్లు నిరంతరం పర్యవేక్షిస్తున్నారని.. జిల్లా కేంద్రంలో కంట్రోల్ రూంను ఏర్పాటు చేశామని చెప్పారు.
సంబంధిత కథనాలు:
వ్యక్తిగత శుభ్రతతోనే.. కరోనాను నిరోధించొచ్చు
భారత్‌లో కరోనా కేసులు@114.. ఒడిశాకు పాకిన వైరస్
'కరోనా చట్టం' మన రాష్ట్రంలోనూ అమలు చేస్తే..?