ETV Bharat / state

GDCC Bank: నకిలీ బంగారం తాకట్టు.. రూ. 42 లక్షల మోసం - Guntur District Central Cooperative Bank Fraud news

GDCC Bank Fraud: తెనాలిలోని గుంటూరు జిల్లా కేంద్ర సహకార బ్యాంకు (జీడీసీసీ) చెంచుపేట బ్రాంచ్​లో భారీ అవకతవకలు వెలుగుచూశాయి. బ్యాంకు మేనేజర్, అప్రైజర్( బంగారం తనఖా పెట్టుకునే అధికారి) కుమ్మక్కై నకిలీ బంగారాన్ని తాకట్టు పెట్టి రూ. 42 లక్షల రుణాలు మంజూరు చేశారు.

నకిలీ బంగారం తాకట్టు
నకిలీ బంగారం తాకట్టు
author img

By

Published : May 17, 2022, 9:50 PM IST

గుంటూరు జిల్లా తెనాలిలోని గుంటూరు జిల్లా కేంద్ర సహకార బ్యాంకు (జీడీసీసీ) చెంచుపేట బ్రాంచ్​లో భారీ అవకతవకలు బయటపడ్డాయి. నకిలీ బంగారం తనఖా పెట్టి కొందరు రుణం తీసుకున్నట్లు ఉన్నతాధికారుల తనిఖీల్లో వెలుగుచూసింది. నకిలీ బంగారం ద్వారా దాదాపుగా రూ.42 లక్షలు రుణంగా తీసుకున్నట్లు బ్యాంక్ సీఈవో కృష్ణవేణి వెల్లడించారు. మరో రెండు రోజుల పాటు దర్యాప్తు కొనసాగుతోందని ఆమె తెలిపారు. బ్యాంకు మేనేజర్, అప్రైజర్( బంగారం తనఖా పెట్టుకునే అధికారి) కుమ్మక్కై రుణాలు మంజూరు చేసినట్లు వెల్లడించారు. ప్రాథమిక దర్యాప్తు ప్రకారం ఆరుగురు ఖాతాదారులు ఈ రుణాలు పొందినట్లు సీఈవో స్పష్టం చేశారు. నిందితులను గుర్తించి నగదును రికవరీ చేస్తామని తెలిపారు.

ఇవీ చూడండి

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.