గుంటూరు జిల్లా వ్యాప్తంగా కొవిడ్ కర్ఫ్యూ కొనసాగుతోంది. రోడ్లన్నీ నిర్మానుష్యంగా మరాయి. మధ్యాహ్నం 12 గంటలకల్లా దుకాణాలు, వాణిజ్య సముదాయాలు, ప్రైవేటు సంస్థలన్నీ మూతపడ్డాయి. అత్యవసర సర్వీసులకు మాత్రమే ప్రభుత్వం మినహాయింపు ఇచ్చింది. ప్రభుత్వ ఆదేశాల మేరకు మిగతా కార్యకలాపాలన్నీ నిలిచిపోయాయి. పోలీసులు కఠిన నిబంధనలను అమలు చేస్తున్నారు. కరోనా కట్టడికి ప్రతి ఒక్కరూ సహకరించాలని ప్రజలను కోరుతున్నారు. నిబంధనలను అతిక్రమిస్తే కేసులు పెడతామని హెచ్చరించారు.
'ప్రభుత్వ ఉద్యోగులు గుర్తింపు కార్డు తెచ్చుకోవాలి'
ప్రభుత్వ ఉద్యోగులు తప్పనిసరిగా తమ వెంట గుర్తింపు కార్డులు తెచ్చుకోవాలని డీఎస్పీ స్రవంతి రాయ్ పేర్కొన్నారు. కరోన కట్టడికి ప్రభుత్వం అమలు చేస్తోన్న నిబంధనలను ప్రతి ఒక్కరూ తప్పక పాటించాలన్నారు. అత్యవసరమైతే తప్ప బయటకు రావోద్దని ప్రజలకు సూచించారు. అత్యవసర సేవలకు మాత్రమే అనుమతి ఉందని తెలిపారు.
రెండు గంటల ముందే బస్సులు నిలిపివేత..
గుంటూరు బస్టాండులో ఆర్టీసీ అధికారులు కర్ఫ్యూ సమయానికంటే రెండు గంటల ముందుగానే బస్సులు నిలిపివేసిన కారణంగా.. ఇబ్బందులు పడినట్లు ప్రయాణికులు చెప్పారు. కనీసం బస్సులు నిలిపేస్తున్నట్లు సమాచారం కూడా ఇవ్వలేదన్నారు.
ఇదీ చదవండి:
'అత్యవసర సేవల్లో ఉండే జర్నలిస్టులు, వైద్య సిబ్బందికి పాస్లు ఇవ్వండి'