కొవిడ్ చికిత్సలు నిర్వహిస్తున్న ఆస్పత్రులకు ప్రభుత్వం రేటింగ్ ఇస్తుందని... రోగులు వచ్చిన అరగంటలో ఆస్పత్రుల్లో చేర్చుకోవాలని గుంటూరు కలెక్టర్ శామ్యూల్ ఆనంద్ కుమార్ అధికారులను ఆదేశించారు. కలెక్టరేట్లో కోవిడ్ నోడల్ అధికారులతో సమీక్ష నిర్వహించారు.
కరోనా రోగులకు మెరుగైన వైద్యం అందించేందుకు నోడల్ అధికారులు బాధ్యతాయుతంగా పని చేయాలని కలెక్టర్ సూచించారు. కోవిడ్ నిబంధనల మేరకు రోజుకు నాలుగు సార్లు ఆస్పత్రులను శానిటైజ్ చేయాలని... ఆస్పత్రుల్లో అమలవుతుందా లేదా పరిశీలించాలన్నారు.
రోగులకు ఇచ్చే ఆహారం, నాణ్యత, వైద్య చికిత్సలు పరిశీలించాలని కలెక్టర్ ఆదేశించారు. ప్రైవేటు ఆస్పత్రుల్లో డబ్బులు చెల్లిస్తేనే అడ్మిట్ చేసుకుంటున్నారన్న ఆరోపణలు వినిపిస్తున్నాయని.. ఇలాంటివి నిరోధించడానికి నోడల్ ఆఫీసర్లను ప్రభుత్వం నియమించినట్లు తెలిపారు. కరోనా పేషెంట్లకు ఆరోగ్యశ్రీ కింద ఉచిత అడ్మిషన్, ఉచిత వైద్యం అందజేయడం జరుగుతుందన్నారు. అనారోగ్యంతో వచ్చిన వారిని ఎట్టిపరిస్థితుల్లోనూ నిర్లక్ష్యం చేయవద్దని సూచించారు.
ఇదీ చదవండి: