కొవిడ్ నివారణ చర్యలతోపాటు ప్రభుత్వ ప్రాధాన్యత అభివృద్ది పనులు వేగవంతం చేయాలని గంటూరు జిల్లా కలెక్టర్ వివేక్ యాదవ్ అధికారులను ఆదేశించారు. జిల్లాలో కొవిడ్ నివారణ చర్యలు, ఉపాధి హామీ పథకం, ప్రభుత్వ భవనాల నిర్మాణ పనులు, పేదలందరికీ ఇళ్ల పథకం, స్పందన ఫిర్యాదులపై తీసుకున్న చర్యలు వంటి అంశాలపై కలెక్టర్ సమీక్షించారు.
ఉపాధి హామీ పనుల్లో ఎక్కువమంది కూలీలు పాల్గొనేలా గ్రామసభలు ఏర్పాటు చేసి అవగాహన కల్పించాలన్నారు. జలకళ పథకం కోసం బోర్ల దరఖాస్తులను తహసీల్దార్లు పరిష్కరించాలని ఆదేశించారు. గ్రామ సచివాలయాలు, రైతు భరోసా కేంద్రాలు, హెల్త్ వెల్నెస్ కేంద్రాల భవన నిర్మాణ పనులు వెంటనే పూర్తి చేయాలని ఆదేశించారు.
ఇదీ చూడండి.
గతి తప్పిన పిల్లల టైంటేబుల్‌ను.. గాడిన పెట్టాల్సింది మీరే..!