అప్పుల బాధ తాళలేక యువకుడు పురుగులమందు తాగి ఆత్మహత్య చేసుకున్న సంఘటన గుంటూరు జిల్లా చిలకలూరిపేట మండలంలో జరిగింది. గోవిందపురం గ్రామానికి చెందిన కోటేశ్వరరావు (32) ఇటీవల కొత్త ఇల్లు నిర్మించి అప్పుల పాలయ్యాడు. రెండు రోజుల క్రితం గోవిందపురం - అమీన్ సాహెబ్ పాలెం గ్రామాల మధ్య పొలాల వద్ద పురుగుల మందు తాగి కుటుంబ సభ్యులకు ఫోన్ చేశాడు.
అక్కడికి చేరుకున్న కటుంబసభ్యులు అతన్ని నరసరావుపేట ప్రభుత్వాసుపత్రికి తరలించారు. పరిస్థితి విషమంగా ఉండడంతో మెరుగైన వైద్యం కోసం జీజీహెకు తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ మృతి చెందాడు. కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు గ్రామీణ ఎస్సై భాస్కర్ చెప్పారు.
ఇదీ చదవండి: