ETV Bharat / state

'నదీ పరివాహక ప్రాంతాల్లో ముందస్తు చర్యలు చేపట్టండి' - గుంటూరు జిల్లా వార్తలు

ఎగువన కురుస్తున్న భారీ వర్షాలకు కృష్ణానదికి వరద పోటెత్తుతోంది. ఈ నేపథ్యంలో గుంటూరుజిల్లాలోని నదీ పరివాహాక ప్రాంతాల అధికారులు ముందస్తు జాగ్రత్త చర్యలు తీసుకోవాలని కలెక్టర్ శామ్యూల్ ఆనంద్ కుమార్ ఆదేశించారు.

guntu Collector Review On Floods
వరదల పై సమీక్షా సమావేశం
author img

By

Published : Aug 21, 2020, 11:04 AM IST

భారీ వర్షాలతో కృష్ణానది నుంచి వస్తున్న వరద నేపథ్యంలో... గుంటూరు జిల్లాలోని నది పరివాహక ప్రాంతాల అధికారులు అప్రమత్తంగా ఉండాలని కలెక్టర్‌ శామ్యూల్‌ ఆనంద్​కుమార్‌ అధికారులను ఆదేశించారు. వరద నీటి ప్రవాహం వల్ల ప్రజలకు ఇబ్బందులు కలగకుండా అవసరమైన ముందస్తు జాగ్రత్త చర్యలు తీసుకోవాలన్నారు.

వరద ప్రభావిత ప్రాంతాల్లో తీసుకోవాల్సిన చర్యలపై జిల్లా కలెక్టర్‌ శామ్యూల్‌ ఆనంద్‌ కుమార్‌ రెవెన్యూ, పోలీస్, ఇరిగేషన్, సివిల్‌ సప్లయిస్, మున్సిపల్, విద్యుత్, అగ్నిమాపక శాఖ అధికారులతో సమీక్షించారు. ఎగువ రాష్ట్రాల్లో కురుస్తున్న భారీ వర్షాలు వల్ల రానున్న రెండురోజుల్లో నాగర్జునసాగర్, పులిచింతల ప్రాజెక్టు గేట్లు ఎత్తి వరద నీటిని సముద్రంలోకి వదిలే అవకాశం ఉందన్నారు. గురజాల, గుంటూరు, తెనాలి రెవెన్యూ డివిజన్‌ పరిధిలోని కృష్ణా పరివాహక ప్రాంతాల్లోని గ్రామాల్లో కృష్ణానది వరద నీటి వల్ల ఇబ్బందుల రాకుండా అధికారులు చర్యలు తీసుకోవాలన్నారు. జిల్లా స్థాయిలో ఎమర్జెన్సీ కంట్రోల్‌ రూం ద్వారా వరద నీటి పరిస్ధితిపై హెచ్చరికలు జారీ చేయటం జరుగుతుందన్నారు. డివిజన్, మండల స్థాయిలోను ఎమర్జెన్సీ కంట్రోల్‌ రూంలను ఏర్పాటు చేసి పరిస్థితిని సమీక్షించాలన్నారు.

  • పునరావాస కేంద్రాలను సిద్ధం చేయండి..

కృష్ణా నది పరివాహక ప్రాంతాల్లోని ప్రజలు, పశువులు కృష్ణానదిలోకి వెళ్లరాదని హెచ్చరికలు జారీ చేయాలని, సమస్యాత్మక ప్రాంతాల్లో బోర్డులు ఏర్పాటు చేయాలన్నారు. కృష్ణానది కరకట్టలు, ఇరిగేషన్‌ కెనాల్స్‌ గట్లను ఇరిగేషన్‌ అధికారులు తనిఖీలు నిర్వహించాలన్నారు. గత సంవత్సర వరదల్లో కాల్వగట్లపై లీకులు వచ్చిన ప్రాంతాలపై ప్రత్యేక దృష్టి పెట్టి వాటి పటిష్టం చేసేందుకు అవసరమైన చర్యలు తీసుకోవాలన్నారు. వరద ముంపు గ్రామాల్లోని ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించేందుకు అవసరమైన పునరావస కేంద్రాలను గుర్తించి సిద్ధం చేయాలన్నారు. కొవిడ్‌ –19 దృష్ట్యా పునరావాస కేంద్రాల్లో భౌతిక దూరం నిబంధన పాటించాలని, శానిటైజేషన్‌ కార్యక్రమాలు నిర్వహించాలన్నారు. అగ్నిమాపక శాఖ రేస్క్యూ రిహాబిలిటేషన్‌ టీంలను, విధ్యుత్‌ శాఖ వరద ముంపు ప్రాంతాల్లో విద్యుత్‌ స్థంబాలు, వైర్లకు సంబంధించి ముందస్తు జాగ్రత్త చర్యలను తీసుకోవాలన్నారు.

ఇవీ చదవండి: గోదావరిని వదలని వరద.. ఇంకా జలజీవనంలోనే బాధితులు

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.