మద్యం మత్తులో విధులకు హాజరయ్యాడు... మత్తులో హల్చల్ చేశాడు. తోటి ఉద్యోగిపై దురుసుగా ప్రవర్తించిన ఘటన గుంటూరు జిల్లా ఫిరంగిపురం మండలం అమీనాబాద్‌లో జరిగింది.
ఫిరంగిపురం మండలం అమీనాబాద్ రెండో గ్రామ సచివాలయం వైఎస్సార్ కాంగ్రెస్ నాయకులు, వాలంటీర్లు, గ్రామ సచివాలయ ఉద్యోగులతో సమావేశం జరిగింది. ప్రభుత్వ పథకాలు మేము చెప్పిన వారికి మాత్రమే మంజూరు చేయాలని నాయకులు ఆదేశించటంతో దీనికి కొంతమంది వాలంటీర్లు అభ్యంతరం తెలిపారు. ప్రభుత్వ నిబంధనలు ప్రకారం హర్హత ఉంటే మంజూరు చేస్తామని వాలంటీర్లు సమాధానం ఇచ్చారు. దీంతో వివాదం జరగటంతో అదే సమయంలో మద్యం మత్తులో ఉన్న డిజిటల్ అసిస్టెంట్ నాగేంద్రబాబు ఆగ్రహంతో అక్కడ ఉన్న టెండర్ పోస్టు ఉద్యోగి శ్రీనివాసరావుపైకి దూకుకెళ్లాడు. సిబ్బందిని దుర్భాషలాడాడు.
ఇదీ చదవండి: 'లంచం ఇచ్చేవారికే ఇసుక సరఫరా చేస్తున్నారు'