ETV Bharat / state

Aided schools: ఊరిలోని బడికి ఉరేసి.. విద్యకు చరమగీతం పాడుతున్న జగనన్న ప్రభుత్వం

Merger of aided educational institutions: ఎయిడెడ్‌ విద్యా సంస్థలపై ప్రభుత్వం కత్తి కట్టింది. వాటి మూసివేతకు చర్యలు తీసుకుంటోంది. 30లోపు విద్యార్థులున్న ప్రాథమిక బడులు సమీప స్కూళ్లలో విలీనం చేయనున్నారు. మరోవైపు టీచర్ల హేతుబద్ధీకరణతో కొత్త నియామకాలూ ఉండవు. ఫలితంగా బోధనకు మూడేళ్లపాటు.. ఒప్పంద ఉపాధ్యాయులే గతి. ప్రభుత్వ నిర్ణయంతో చాలా మంది చదువుకు దూరం అయ్యే పరిస్థితి నెలకొంది.

Merger of aided educational institutions
ఊరిలోని బడికి ఉరేసి.. విద్యకు చరమగీతం పాడుతున్న జగనన్న ప్రభుత్వం
author img

By

Published : Jun 26, 2023, 7:11 AM IST

ఊరిలోని బడికి ఉరేసి.. విద్యకు చరమగీతం పాడుతున్న జగనన్న ప్రభుత్వం

Merger of aided educational institutions: రాష్ట్రంలో ఎయిడెడ్‌ విద్యాసంస్థలను ప్రభుత్వం కాలగర్భంలో కలిపేస్తోంది. అధికారంలోకి వచ్చినప్పటి నుంచి ఎయిడెడ్‌ విద్యా వ్యవస్థను నాశనం చేయడంపైనే దృష్టిపెట్టిన వైసీపీ ప్రభుత్వం.. ఆర్థిక భారం తగ్గించుకోవడంతోపాటు వీటి ఆస్తులపైనా కన్నేసింది. రెండేళ్లుగా స్తబ్దుగా ఉన్న ప్రభుత్వం ఇప్పుడు హేతుబద్ధీకరణ, పాఠశాలల విలీనాన్ని తెరపైకి తెచ్చింది. ఎయిడెడ్‌ విద్యా సంస్థల ఊపిరి తీసేందుకు ప్రభుత్వం 2021లో నిర్ణయించింది. ఆస్తులతో సహా సిబ్బందిని ప్రభుత్వంలో విలీనం చేయడం, ఆస్తులు ఇవ్వకుండా ఎయిడెడ్‌ సిబ్బందిని మాత్రమే ప్రభుత్వానికి అప్పగించొచ్చంటూ ఆ ఉత్తర్వుల్లో పేర్కొంది. అప్పట్లో విద్యా సంస్థల యాజమాన్యాల మెడపై కత్తి పెట్టి లిఖితపూర్వకంగా ఐచ్ఛికాలను తీసుకుంది. దీనిపై పెద్దఎత్తున విద్యార్థులు, తల్లిదండ్రులు, విద్యావేత్తల నుంచి వ్యతిరేకత వ్యక్తమైంది. ఎయిడెడ్‌ పాఠశాలలు లేకపోతే ఎక్కడ చదువుకోవాలంటూ పిల్లలు రోడ్డెక్కారు. దీంతో వెనక్కి తగ్గిన ప్రభుత్వం ఆస్తులతో సహా ఇచ్చేందుకు.. కేవలం సిబ్బందిని మాత్రమే ఇచ్చేందుకు సమ్మతి తెలిపిన యాజమాన్యాలు తమ అంగీకారాన్ని వెనక్కి తీసుకోవచ్చంటూ వెసులుబాటు కల్పించింది. కానీ, అప్పటికే జరగాల్సిన నష్టం జరిగిపోయింది.

ప్రైవేటుగా మారుతున్న బడులు.. చాలా ఎయిడెడ్‌ బడులు ప్రైవేటుగా మారిపోయాయి. విద్యార్థులు ఫీజులు చెల్లించాల్సిన దుస్థితి వచ్చింది. తర్వాత కొంతకాలం మౌనంగా ఉన్న ప్రభుత్వం గతేడాది అక్టోబరులో మరో కొత్త ఎత్తుగడ వేసింది. మూడేళ్లుగా వరసగా ప్రవేశాలు తగ్గిన ఎయిడెడ్‌ పాఠశాలలను మూసివేసేలా ఆదేశాలు ఇచ్చింది. 2020-21, 2021-22, 2022-23 సంవత్సరాల్లో విద్యార్థుల సంఖ్యను ప్రామాణికంగా తీసుకొని, కొన్నింటిని మూసివేసింది. మరికొన్నింటికి హెచ్చరికలు చేయడంతో మరో ఏడాది సమయం కావాలంటూ యాజమాన్యాలు కోరాయి. ఇప్పుడు మళ్లీ ఎయిడెడ్‌పై కత్తి తీసింది.

ఆస్తులు కబ్జా చేసేందుకు వైసీపీ నేతల ప్రయత్నాలు.. రాష్ట్ర వ్యాప్తంగా 1,988 ఎయిడెడ్‌ పాఠశాలలు ఉండగా.. వీటిల్లో 88 యాజమాన్యాలు గతంలో ఆస్తులతో సహా ప్రభుత్వానికి అప్పగించాయి. విజయవాడ నగర శివారు గొల్లపూడిలోని పోసాని నర్సింహారావు చౌదరి ఉన్నత పాఠశాలతో పాటు దానికి ఉన్న 7.02 ఎకరాల పొలాన్ని విద్యాశాఖకు దేవాదాయశాఖ అప్పగించింది. 2.74 ఎకరాల్లో పాఠశాల ప్రాంగణం ఉండగా.. మిగతాది పొలంగా ఉంది. దీన్ని కబ్జా చేసేందుకు వైసీపీ నేత ప్రయత్నాలు చేస్తున్నారు. ప్రభుత్వానికి అప్పగించిన ఆస్తులను ప్రభుత్వం ఇతర ప్రయోజనాలకు వినియోగించుకోవచ్చనే నిబంధన ఉండడంతో దీన్ని ఆక్రమించేందుకు ప్రయత్నాలు సాగుతున్నాయి. చాలా ఎయిడెడ్‌ సంస్థలకు విలువైన స్థలాలు ఉన్నాయి. అప్పట్లో దాతలు స్థలాల ఆదాయంతో పాఠశాలలు నిర్వహించేందుకు వాటిని ట్రస్టులకు అప్పగించారు. మరో 1,214 పాఠశాలలు ఆస్తులను ఇవ్వకుండా కేవలం ఎయిడెడ్‌ పోస్టులను మాత్రమే మొదట్లో అప్పగించాయి. ప్రభుత్వం వెనక్కి తీసుకునేందుకు అవకాశం ఇవ్వడంతో 853 యాజమాన్యాలు ఎయిడెడ్‌లోకి వచ్చేశాయి.

పాఠశాలల విలీనమంటూ ఆదేశాలు జారీ.. ఎయిడెడ్‌ పాఠశాలల్లో కొన్నేళ్లుగా ఉపాధ్యాయుల నియామకాలు చేపట్టకపోవడంతో భారీగా ఖాళీలున్నాయి. యాజమాన్యాలు ప్రైవేటు టీచర్లతో.. కొన్నిచోట్ల ఎయిడెడ్‌, అన్‌ఎయిడెడ్‌ సెక్షన్లతో ఇబ్బందులను అధిగమిస్తున్నాయి. ఎయిడెడ్‌ ఖాళీల భర్తీకి యాజమాన్యాలు ఇటీవల ప్రభుత్వంపై ఒత్తిడి తేవడంతో హేతుబద్ధీకరణ, పాఠశాలల విలీనమంటూ ఆదేశాలు జారీ చేసింది. హేతుబద్ధీకరణ ద్వారా ఉపాధ్యాయుల నియామకాలను తగ్గించేయనుంది. కొత్తగా నియామకాలు చేపట్టాల్సి వచ్చినా మూడేళ్లపాటు కాంట్రాక్టు సిబ్బందినే పెట్టుకోవాలనే నిబంధన తెచ్చింది. ప్రభుత్వ ప్రాథమిక బడుల్లో 20 మంది విద్యార్థులున్నా ఒక టీచర్‌ను ఇచ్చి కొనసాగిస్తామని చెప్పిన ప్రభుత్వం.. ఎయిడెడ్‌కు వచ్చేసరికి 30 మంది లోపు ఉంటే విలీనం చేయబోతోంది. 30 మంది లోపు పిల్లలు ఉన్న ప్రాథమిక పాఠశాలలను కిలోమీటరు దూరంలోని ప్రాథమిక, ప్రాథమికోన్నత పాఠశాలల్లో విలీనం చేస్తారు. ఇక్కడి టీచర్లను మిగులుగా చూపి.. అవసరమైన చోట సర్దుబాటు చేస్తారు. పాఠశాలలు పునఃప్రారంభమైన తర్వాత హేతుబద్ధీకరణ చేపట్టడం వల్ల పిల్లలు ఇబ్బంది పడనున్నారు.

ఊరిలో బడికి ఉరి.. 1-5 తరగతుల్లో 60 మంది ఉంటే రెండో టీచర్‌ను ఇస్తారు. ప్రాథమికోన్నత పాఠశాలల్లో 6, 7 తరగతుల్లో 35లోపు విద్యార్థులు ఉంటే వీటిని మూడు కిలోమీటర్ల దూరంలోని పాఠశాలల్లో విలీనం చేస్తారు. ఈ తరగతులకు బోధిస్తున్న టీచర్లను మిగులుగా చూపుతారు. ఉన్నత పాఠశాలలో 6-10 తరగతుల్లో 75 మంది లోపు పిల్లలు ఉంటే వీటిని మూడు కిలోమీటర్ల దూరంలోని బడుల్లో కలిపేస్తారు. ఈ ఆదేశాలతో చాలా పాఠశాలలు మూతపడనున్నాయి. ఉమ్మడి ప్రకాశం జిల్లాలో దాదాపు 50వరకు మూతపడే అవకాశం ఉంది. రాష్ట్ర వ్యాప్తంగా 418 ఎయిడెడ్‌ పాఠశాలల్లో 40 మంది లోపు విద్యార్థులే ఉన్నారు. ప్రభుత్వం ఇప్పుడు తీసుకొచ్చిన ఉత్తర్వులతో వీటిల్లో చాలా వరకు మూతపడే అవకాశం ఉంది.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.