ETV Bharat / state

మీ ఇంట్లో వివాహేతర సంబంధాలున్నాయా?.. ప్రభుత్వ సర్వేలో ప్రశ్నలు..! - latest news in ap

Government Survey On Extramarital Affairs: మామూలుగా రాష్ట్ర ప్రభుత్వ సర్వే అంటే ఇంట్లో ఉన్న వారి వివరాలు, లేకపోతే వారికి అందుతున్న సంక్షేమ వివరాలు సేకరించడం. ఇది సహజం, సర్వసాధారణం. కానీ వైసీపీ ప్రభుత్వ సర్వేలు మాత్రం ఇందుకు విరుద్ధం. ఎందుకంటారా.. ఇది చదవండి.. మీకే తెలుస్తోంది.

government survey on extramarital affairs

author img

By

Published : Dec 22, 2022, 12:07 PM IST

Government Survey: గ్రామ, వార్డు సచివాలయ సిబ్బంది, వాలంటీర్లను వినియోగించుకుని రాష్ట్ర ప్రభుత్వం నిర్వహిస్తున్న సర్వేల్లో అడుగుతున్న ప్రశ్నలు పరాకాష్ఠకు చేరాయి. ‘‘మీ ఇంట్లో వివాహేతర సంబంధాలున్నాయా? బహుళ లైంగిక సంబంధాలు కొనసాగిస్తున్నారా? ఒకటి కంటే ఎక్కువ పెళ్లిళ్లు చేసుకున్నారా? వీటికి సంబంధించి పాత కేసులు ఏమైనా ఉన్నాయా?’’ అని అడుగుతున్నారు. ‘నేరాలకు దారితీసే అవకాశం ఉన్న పాత విరోధాల వివరాల సేకరణ’ పేరిట ఆంధ్రప్రదేశ్‌ పోలీసు శాఖ ఇంటింటికీ వెళ్లి మరీ ఇలాంటి ఇబ్బందికర ప్రశ్నలు వేస్తోంది.

మహిళా పోలీసులు వాలంటీర్లతో కలిసి తమ పరిధిలోని అన్ని ఇళ్లకు వెళ్లి ఈ వివరాలు రాబడుతున్నారు. ఈ ప్రశ్నలు అడగటానికి మహిళా పోలీసులు కొంత ఇబ్బంది పడుతుండగా, ఆ ప్రస్తావన తెచ్చినప్పుడు ఒక్కోసారి ఆయా ఇళ్లలోని వారి నుంచి తీవ్ర ప్రతిఘటన ఎదురవుతోంది. ఇవేకాకుండా ఆ ఇంట్లోని వ్యక్తులకు సంబంధించి ఆస్తి, సరిహద్దు వివాదాలు, గృహహింస కేసులు, మద్యసేవనం, ఈవ్‌టీజింగ్‌, బహిరంగ మద్యపానం, కుల, మత, రాజకీయపరమైన విరోధాలకు సంబంధించిన కేసుల వివరాలూ సేకరిస్తున్నారు.

మొత్తం 12 రకాల అంశాలు అడిగి తెలుసుకుంటున్నారు. వాటన్నింటినీ నిర్దేశిత నమూనాలో పొందుపరిచి రోజూ సాయంత్రం 7 గంటలకు అంతా సంబంధిత స్టేషన్‌హౌస్‌ అధికారి (ఎస్‌హెచ్‌వో)కి అందజేస్తున్నారు. కొన్ని రోజులుగా ఈ ప్రక్రియ కొనసాగుతోంది.

ఎన్నికల్లో బెదిరింపులకు పాల్పడేందుకే!: రాజకీయ ప్రత్యర్థులు, ప్రతిపక్ష పార్టీల సానుభూతిపరులు, తమకు గిట్టనివారిని వేధించేందుకు, కేసుల్లో ఇరికించేందుకే ప్రజలకు సంబంధించిన అత్యంత సున్నితమైన, వ్యక్తిగతమైన వివరాలను పోలీసుశాఖ సేకరిస్తోందని ప్రతిపక్ష నాయకులు ఆరోపిస్తున్నారు. ఈ సమాచారాన్ని వాలంటీర్లు తమవద్ద పెట్టుకుని ఎన్నికల్లో బెదిరింపులకు పాల్పడే అవకాశంఉందని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

ఇవీ చదవండి:

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.