ప్రభుత్వం నూతనంగా మహాత్మాగాంధీ జాతీయ ఉపాధి హామీ పథకం ద్వారా బహువార్షిక పశుగ్రాసాల సాగు చేసుకునే అవకాశాన్ని రైతన్నలకు కల్పించింది. ఈ పథకం ద్వారా అర్హులైన రైతులకు రెండు సంవత్సరాలకు ప్రభుత్వం నుంచి రూ.83,654 ప్రోత్సాహకాన్ని ప్రభుత్వం కల్పించనుంది. మొదటి సంవత్సరం ఖర్చు కింద రూ.51,301, రెండవ ఏడాదికి రూ.32,353 అందుబాటులోకి తెచ్చింది.
ఈ పథకానికి సొంత భూమి ఉన్నవారితో పాటు కౌలు రైతులు కూడా అర్హులని ప్రభుత్వం తెలిపింది. ఒక్కొక్క రైతుకు 0.25 ఎకరాల నుంచి 2.5 ఎకరాల వరకు సాగు చేసుకునే అవకాశాన్ని కల్పించింది. అదే క్రమంలో రైతులు సమూహంగా ఏర్పడి 5 ఎకరాల వరకూ అర్హత పొందే అవకాశాన్ని కల్పించింది. ఉపాధి హామీ పథకం మీద ఎకరాకు కూలీలకు రూ.45,030.. మెటీరియల్ కాంపౌండ్ కింద రూ. 38,624 చెల్లించనుంది.
పథకానికి కావలసిన పత్రాలు..
ఈ పథకం కింద అర్హత పొందడానికి రైతన్నలకు అవసరమైన పత్రాలు గ్రామసభల తీర్మానం, మండల తీర్మానం, ఉపాధిహామీ జాబ్ కార్డు, బ్యాంకు పాస్ బుక్, ఆధార్ కార్డు, రేషన్ కార్డు జిరాక్స్లను వారికి దగ్గరలోని పశువైద్య అధికారులను లేదా దగ్గర్లోని రైతు భరోసా కేంద్రానికి వెళ్లి సమర్పించాలి. అక్కడి అధికారులు అర్హులను ఎంపిక చేస్తారని గుంటూరు జిల్లా కొల్లూరు పశు వైద్యశాల వెటర్నరీ అసిస్టెంట్ సర్జన్ డాక్టర్.రాజేంద్రప్రసాద్ తెలిపారు. మరిన్ని వివరాల కోసం దగ్గరలోని పశు వైద్యశాలను లేదా రైతు భరోసా కేంద్రాలను సంప్రదించాలని సూచించారు.
ఇవీ చదవండి: