Junior doctors stipend: 15 శాతానికి మించి ఉపకార వేతనం పెంచలేమని... సమ్మె నోటీస్ ఇచ్చిన విద్యార్థి వైద్యులకు ప్రభుత్వం తేల్చిచెప్పింది . 42 శాతం ఉపకార వేతనాలు పెంచాలంటూ జూడాలు సమ్మె నోటీసు ఇచ్చిన నేపథ్యంలో ఉపకార వేతనం పెంచుతూ వైద్యారోగ్యశాఖ ఉత్తర్వులిచ్చింది. పీజీ మెుదటి సంవత్సరం విద్యార్థులకు రూ.44 వేల నుంచి రూ.50 వేల 686 రూపాయలకు, ద్వితీయ సంవత్సరం విద్యార్థులకు రూ.46వేల నుంచి రూ.53వేలకు, మూడో సంవత్సరం విద్యార్థులకు 48 వేల 973 నుంచి 53 వేల 503 రూపాయలకు పెంచుతున్నట్లు ప్రకటించింది. ఎంబీబీఎస్ విద్యార్థులకు 19 వేల 589 రూపాయల నుంచి 22 వేల 527 పెంచుతున్నట్లు వెల్లడించింది. పెంచిన వేతనాలు 2022 జనవరి నుంచి అమలవుతాయని వైద్యారోగ్య శాఖ స్పష్టం చేసింది.
ప్రభుత్వ ఉత్తర్వులపై అసంతృప్తి వ్యక్తం చేసిన జూడాలు వైద్యారోగ్య శాఖ ముఖ్య కార్యదర్శి కృష్ణబాబుతో చర్చలు జరిపారు. ఈ సందర్భంగా డిమాండ్లను మరోసారి ప్రస్తావించగా.. 15 శాతానికి మించి స్తైఫండ్ పెంచలేమని... ఆయన తేల్చి చెప్పింది. దీనికి సంబంధించి ఉత్తర్వులు కూడా ఇచ్చామని చెప్పారు. దీనిపై ఆలోచించి నిర్ణయం చెబుతామని... విద్యార్థి వైద్యులు స్పష్టం చేశారు.
ఇవీ చదవండి: