గుంటూరు ప్రభుత్వాసుపత్రిలో భద్రత సిబ్బంది విధులను బహిష్కరించింది. 5 నెలలుగా వేతనాలు చెల్లించడం లేదంటూ సెక్యూరిటీ ఉద్యోగులు ఆస్పత్రి ఆవరణలో ఆందోళన చేశారు. మూడేళ్లుగా జై బాలాజీ సంస్థ వారు వేతనాలు ఇస్తున్నారని, అయితే ఈ నెల 30 తో వారి ఒప్పంద గడువు ముగియనుందని తెలిపారు. వారు వెళ్లిపోతే తమకు రావాల్సిన వేతన బకాయిలు ఎవరిస్తారంటూ ఆవేదన వ్యక్తంచేశారు. తమకు వేతనాలు చెల్లించే వరకు విధుల్లోకి వెళ్లమని చెప్పిన సిబ్బంది... జీతాలు చెల్లించాలని అడిగినందుకు ఉద్యోగం నుంచి తొలగిస్తామని బెదిరింపులకు పాల్పడుతున్నారని వాపోయారు. అధికారులు తగిన చర్యలు తీసుకుని బకాయిలు చెల్లించడంతోపాటు ఉద్యోగ భద్రత కల్పించాలని కోరారు.
ఇవి కూడా చదవండి: