ETV Bharat / state

నేడు రాజధాని వ్యాజ్యాలపై ప్రభుత్వ వాదనలు

రాజధాని వ్యాజ్యాలపై నేడు హై కోర్టులో ప్రభుత్వ వాదనలు ప్రారంభం కానున్నాయి. వాదనలు వినిపించేందుకు సుప్రీంకోర్టు సీనియర్ న్యాయవాది దుష్యంత్ దవే మంగళవారం కోర్టుకు హాజరుకానున్నారు.

government-arguments-on-capital-lawsuits-from-today
నేడు రాజధాని వ్యాజ్యాలపై ప్రభుత్వ వాదనలు
author img

By

Published : Dec 8, 2020, 12:20 AM IST

రాజధాని అంశంతో సంబంధమున్న వ్యాజ్యాలపై హైకోర్టులో ప్రభుత్వ వాదనలు ఇవాళ ప్రారంభం కానున్నాయి. ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ జీకే మహేశ్వరి, జస్టిస్‌ ఎం. సత్యనారాయణమూర్తి, జస్టిస్‌ ఎన్‌. జయసూర్యతో కూడిన ధర్మాసనం ముందుకు ఈ వ్యాజ్యాలు సోమవారం విచారణకు వచ్చాయి. అడ్వకేట్‌ జనరల్‌ ఎస్‌. శ్రీరామ్‌ స్పందిస్తూ.......వాదనలు వినిపించేందుకు సుప్రీంకోర్టు సీనియర్‌ న్యాయవాది దుష్యంత్ దవే మంగళవారం కోర్టుకు హాజరుకానున్నారని తెలిపారు. విచారణను మంగళవారానికి వాయిదా వేయాలని కోరగా......ధర్మాసనం సానుకూలంగా స్పందించింది. పిటిషనర్ల తరఫు న్యాయవాదులు ఇటీవలే తమ వాదనలు వినిపించారు. పాలనా వికేంద్రీకరణ చట్టం ప్రకారం అభివృద్ధికి చర్యలు తీసుకునేలా ఆదేశించాలంటూ........కర్నూలుకు చెందిన న్యాయవాది వి.నాగలక్ష్మిదేవి వేసిన వ్యాజ్యాన్ని త్వరగా విచారించాలని న్యాయవాది ఎస్‌. శరత్‌కుమార్‌ త్రిసభ్య ధర్మాసనం ముందు ప్రస్తావించారు. తక్షణమే ఆ వ్యాజ్యంపై విచారణ జరపలేమని ధర్మాసనం పేర్కొంది. ఆ విషయం పూర్తిగా భిన్నమైనదని అభిప్రాయపడిన ధర్మాసనం........కేసుల విచారణ జాబితాలోకి వ్యాజ్యం వచ్చినపుడు జ్యుడీషియల్ ఆర్డర్‌ జారీచేస్తామని స్పష్టం చేసింది.

ఇదీచదవండి.

భారత్​ బంద్​పై మంత్రి కన్నబాబు ఏమన్నారంటే?

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.