నకిలీ బంగారాన్ని తనఖా పెట్టి బ్యాంకు నుంచి లక్షల్లో రుణం పొందిన ఘటన.. గుంటూరులోని "తమిళనాడు మార్కంటైల్ బ్యాంకు"లో చోటు చేసుకుంది. ఓ ఘరానా ముఠా చేసిన ఈ మోసం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.
ఎస్ఐ సత్యనారాయణ తెలిపిన వివరాల ప్రకారం.. గుంటూరు జిల్లా చేబ్రోలులోని తమిళనాడు మర్కెంటైల్ బ్యాంకులో బాబురావు గోల్డ్ అప్రైజర్‌గా పనిచేస్తున్నారు. ఐదేళ్లుగా నమ్మకంగా పనిచేస్తున్న సుబ్బారావు.. తన కుమారుడితోపాటు అతని ముగ్గురు స్నేహితులతో కుమ్మక్కై ఘరానా మోసానికి పాల్పడ్డాడు. బ్యాంకు మేనేజర్ లేని సమయం చూసి నకిలీ బంగారం తీసుకువచ్చి బ్యాంకులో తనఖా పెట్టి రూ.35 లక్షల రూపాయల రుణం తీసుకుని వివిధ ఖాతాలకు మళ్లించాడు. ఆ తర్వాత అనుమానంతో తాకట్టు పెట్టిన బంగారాన్ని మేనేజర్ పరిశీలించగా.. అది నకిలీదని తేలింది. దీంతో గోల్డ్ అప్రైజర్ సుబ్బారావు రాత్రికి రాత్రే ఉడాయించాడు. బ్యాంక్ మేనేజర్ సతీష్ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.
ఇవీ చూడండి :