ETV Bharat / state

వేధింపులతో బాలిక ఆత్మహత్య.. బాధిత కుటుంబానికి హెం మంత్రి పరామర్శ

యువకుడి వేధింపులు తాళలేక బాలిక ఆత్మహత్య చేసుకున్న ఘటనలో.. బాధిత కుటుంబాన్ని హోంమంత్రి సుచరిత, ఎమ్మెల్యే ఉండవల్లి శ్రీదేవి పరామర్శించారు. కుటుంబానికి తాము అండగా ఉంటామని హామీ ఇచ్చారు. 10 లక్షల రూపాయలు ఆర్ధిక సాయం ప్రకటించారు.

Girl commits suicide due to love harassment
ఆత్మహత్య చేసుకున్న బాలిక కుటుంబానికి కుటుంబానికి హోంమంత్రి, ఎమ్మెల్యే పరామర్శ
author img

By

Published : Dec 23, 2020, 7:17 AM IST

గుంటూరు జిల్లా మేడికొండూరు మండలం కొర్రపాడులో యువకుడి ప్రేమ వేధింపులు తాళలేక బాలిక ఆత్మహత్య చేసుకుంది. ఆ బాలిక కుటుంబాన్ని హోం మంత్రి సుచరిత, ఎమ్మెల్యే ఉండవల్లి శ్రీదేవి పరామర్శించారు. ఈ ఘటన బాధ కలిగించిదన్న ఆమె.. ఎన్ని చట్టాలు చేసినా ఇలాంటి సంఘటనలు చోటు చేసుకోవటం దురదృష్టకరమన్నారు.

బాలిక కుటుంబానికి రూ.10 లక్షలు ఆర్థిక సాయం చేస్తున్నట్లు హోం మంత్రి ప్రకటించారు. దేశంలో ఎక్కడా లేని విధంగా మన రాష్ట్రంలోనే దిశ చట్టం అమలు చేస్తున్నారని ఎమ్మెల్యే ఉండవల్లి శ్రీదేవి పేర్కొన్నారు. డీఎస్పీ ప్రశాంతి, వైకాపా నాయకులు కెమ్మేళ శ్రీధర్ తదితరులు పాల్గొన్నారు.

ఇవీ చూడండి:

'ప్రభుత్వ ఉద్యోగులకు 11వ పీఆర్సీని వెంటనే విడుదల చేయాలి'

For All Latest Updates

TAGGED:

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.