ETV Bharat / state

చట్ట ప్రకారం శిక్షిస్తామన్న డీఎంఈ.. ఆందోళన విరమించిన జూడాలు

జీజీహెచ్​లో ఆందోళన చేస్తున్న జూనియర్‌ వైద్యులతో డి.ఎం.ఇ. చర్చలు సఫలమయ్యాయి. మెడికల్ చట్టప్రకారం వైద్యులపై దాడి చేసిన వారిని శిక్షిస్తామని డీఎంఈ రాఘవేంద్రరావు హామీ ఇవ్వడంతో.. జూడాలు ఆందోళనను విరమించారు.

author img

By

Published : Dec 10, 2021, 12:13 PM IST

ggh-junior-doctors-stopped-protest
జూడాలతో డి.ఎం.ఇ. చర్చలు సఫలం

గుంటూరు జీజీహెచ్ లో గత మూడు రోజులుగా ఆందోళన చేస్తున్న జూనియర్ వైద్యులు.. ఎట్టకేలకు తమ ఆందోళన విరమించారు. జూడాలతో డి.ఎం.ఈ జరిపిన చర్చలు సఫలమయ్యాయి. దాడిచేసిన వారిని వెంటనే అరెస్టు చేయాలని వైద్యులు డిమాండ్ చేశారు.

ఈ సందర్భంగా.. డీఎంఈ రాఘవేంద్రరావు మాట్లాడుతూ.. విధుల్లో ఉన్న వైద్యుడిపై దాడి హేయమైన చర్య అని అన్నారు. రోగులకు ఏవైనా ఇబ్బందులు ఉంటే ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేయాలని సూచించారు. అంతే తప్ప, వైద్యులపై దాడి చేస్తే.. మెడికల్ చట్టప్రకారం శిక్ష పడుతుందని హెచ్చరించారు.

ఏం జరిగిందంటే?
గుంటూరు జీజీహెచ్‌లో జూనియర్ వైద్యులపై ఓ రోగి బంధువులు దాడి చేశారు. వైద్య సేవల్లో నిర్లక్ష్యం వహించారనే కారణంతో.. దాడికి పాల్పడ్డారు. ఈ చర్యను జూడాలు నిరసించారు. దాడిచేసిన వారిపై చర్యలు తీసుకోవాలని ఆందోళన చేపట్టారు. గడిచిన మూడోరోజులుగా జూనియర్ వైద్యులు ఆందోళన కొనసాగించారు. వివిధ రూపాల్లో తమ నిరసన తెలిపారు. గురువారం విధులు బహిష్కరించిన జూడాలు.. కలెక్టరేట్, ఎస్పీ కార్యాలయాలకు నిరసన ప్రదర్శన నిర్వహించారు.

కాగా.. ఈ ఘటనలో ఇప్పటికే పోలీసులు ముగ్గురిని అరెస్టు చేశారు. అయితే.. ప్రధాన నిందితుడిని కూడా అరెస్టు చేయాలంటూ జూనియర్ వైద్యులు డిమాండ్ చేస్తున్నారు. ప్రధాన నిందితుడిని అరెస్టు చేసేవరకు తాము విధులకు హాజరుకాబోమని జూనియర్ వైద్యులు స్పష్టం చేశారు.

వీరికి మద్దతుగా కర్నూలు, విజయవాడలోనూ జూడాలు ఆందోళన చేపట్టారు. బెజవాడలో ఓపీ సేవలు బహిష్కరించి జూనియర్‌ వైద్యుల ఆందోళన చేపట్టారు. ప్రజలకు సేవలందిస్తున్న తమపై దాడులు సబబేనా? అని ప్రశ్నించారు. కరోనా సమయంలోనూ ప్రాణాలకు తెగించి సేవలు చేశామని, అయినా.. తమపై దాడులు చేస్తున్నారని, ఇటీవల ఈ దాడులు మరింతగా పెరిగిపోతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు.

చట్టాలున్నా అధికారులు అమలు చేయట్లేదని, మొక్కుబడి చర్యలతో తమకు రక్షణ లేకుండా పోయిందని ఆందోళన వ్యక్తం చేశారు. దాడులు చేసినవారిని వెంటనే అరెస్టు చేసి, శిక్ష పడేలా చూడాలని డిమాండ్ చేశారు. ప్రభుత్వం స్పందించకుంటే అత్యవసర సేవల బహిష్కరిస్తామని అన్నారు. ఈ క్రమంలో.. నాలుగో రోజు కూడా ఆందోళన కొనసాగించేందుకు సిద్ధమయ్యారు. దీంతో.. గుంటూరు జీజీహెచ్ జూడాలతో డి.ఎం.ఈ చర్చలకు సిద్ధమయ్యారు. ఈ చర్చలు సఫలం కావడంతో జూడాలు ఆందోళన విరమించేందుకు అంగీకరించారు.

ఇదీ చూడండి:

Gas Leak in Vijayawada: విజయవాడలో గ్యాస్ పైపులైన్ లీక్‌.. చెలరేగిన మంటలు

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.