ETV Bharat / state

ఎండోస్కోపి ద్వారా బాలిక పొట్టలో సూది తొలగింపు - గుంటూరు తాాజా వార్తలు

ఎండోస్కోపి ద్వారా బాలిక పొట్టలోని సూదిని విజయవంతంగా తొలగించారు గుంటూరు సర్వజానుసుపత్రి వైద్యులు. గత నెల 28న ఇంట్లో ఆడుకుంటూ చిన్నారి గుండు సూదిని మింగింది. విజయవంతంగా ఎండోస్కోపి నిర్వహించిన వైద్యులను సూపరింటెండెంట్ డాక్టర్ ప్రభావతి అభినందించారు.

ఎండోస్కోపి ద్వారా బాలిక పొట్టలో సూది తొలగింపు

author img

By

Published : Sep 16, 2021, 2:07 PM IST

ఎండో స్కోపీ చికిత్సతో బాలిక పొట్టలో గుండుసూదిని విజయవంతంగా తొలగించారు గుంటూరు సర్వజనాసుపత్రి వైద్యులు. గుంటూరులోని అమరావతి రోడ్డులో కొండయ్య కాలనీకి చెందిన చెన్నకేశవ, పుష్ప దంపతుల కుమార్తె (3) పొట్టలో ఉన్నట్టుండి ఏదో మెలి తిప్పుతున్నట్లు బాధపడేది. గతనెల 28వ తేదీ నుంచి అప్పుడప్పుడు బాధతో విలవిల్లాడుతుండేది. ఆ నొప్పి ఎందుకో ఏమిటో అర్థంకాక బుధవారం గుంటూరు సర్వజనాసుపత్రికి తీసుకొచ్చారు తల్లిదండ్రులు. గ్యాస్ట్రో ఎంటరాలజీ విభాగంలో చేర్పించారు. అక్కడి వైద్యులు పరీక్షలు నిర్వహించగా పొట్టలో సూది ఉందని గుర్తించారు. ఇంట్లో ఆడుకుంటూ ఉత్సుకత కొద్దీ కనిపించిన గుండుసూదిని నోట్లో పెట్టుకుని మింగి ఉంటుందని, దీంతో కడుపునొప్పితో బాధపడుతున్నట్లు వైద్యులు తెలుసుకున్నారు. అత్యవసరంగా దాన్ని తొలగించాలని నిర్ణయించారు. పొట్ట లోపల ఏం జరుగుతోందో, సమస్యకు మూలాలు ఎక్కడున్నాయో పరిశీలించే పరికరాలు జీజీహెచ్‌లో అందుబాటులో ఉన్నాయి. దీంతో ఎండోస్కోపీ కెమెరా గొట్టాన్ని లోపలికి పంపి సూది ఎక్కడుందో గుర్తించి దీని సాయంతోనే బయటకు తీశారు. ఈ చికిత్సలో గ్యాస్ట్రో ఎంటరాలజీ విభాగం అధిపతి కవిత, సహాయ ఆచార్యులు నాగూర్‌బాషా, మత్తు వైద్యులు చంద్రశేఖర్‌, శాంతిలత తదితరులు పాల్గొన్నారు. ఈ చికిత్సలో పాల్గొన్న వైద్యుల బృందాన్ని సూపరింటెండెంట్‌ ప్రభావతి ప్రత్యేకంగా అభినందించారు.

ఇదీ చదవండి: తల్లి, చెల్లి మరణించారన్న బాధను దిగమింగుతూ..

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.