గుంటూరు జిల్లా పెదకాకానిలోని హెచ్‌పీ కంపెనీకి చెందిన సాయి గ్యాస్ ఏజెన్సీని పౌర సరఫరాల శాఖ అధికారులు సీజ్ చేశారు. ఏజెన్సీ నుంచి గ్యాస్ సిలిండర్‌ను వినియోగదారుల ఇంటి వద్దకు చేర్చాలి. ఈ క్రమంలోనే సిలిండర్‌ను మోసుకుని వచ్చినందుకు డెలివరీ బాయ్స్ అదనంగా డబ్బులను వినియోగదారుల నుంచి వసూలు చేస్తున్నారు. సిలిండర్‌కు 20, 60, 80 ఇలా ఇష్టానుసారంగా వసూలు చేస్తున్నట్లు పౌర సరఫరాల శాఖ అధికారులు గుర్తించారు. తనిఖీ చేపట్టిన క్రమంలో వాస్తవాలు బయటకు రావడంతో గ్యాస్ ఏజెన్సీని సీజ్ చేసినట్లు పౌర సరఫరాల శాఖ అధికారి టి.శివరామప్రసాద్ పేర్కొన్నారు. వినియోగదారుల నుంచి అదనంగా వసూళ్లు చేపడితే చట్టపరంగా చర్యలు తీసుకుంటామని, తనిఖీలను నిరంతరం కొనసాగిస్తామని తెలిపారు. సీజ్ చేసిన ఏజెన్సీ పరిధిలోని వినియోగదారులకు అవసరమైన సిలిండర్‌లను అందించేందుకు సీతానగరంలోని మాధురి ఏజెన్సీ, నగరాలు ప్రాంతంలోని బాపూజీ గ్యాస్ ఏజెన్సీలకు అప్పగించాలని సంబంధిత సేల్స్ అధికారికి సూచించినట్లు పేర్కొన్నారు.
ఇదీ చూడండి.